పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ ( సీఈఓ) గా గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ అమర్‌జీత్ సింగ్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ ( సీఈఓ) గా గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ అమర్‌జీత్ సింగ్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ అమర్‌జీత్ సింగ్ పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. కేంద్ర కేబినెట్ కు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ (ఏసీసీ) ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తెలిపింది.