రాందేవ్‌తోపాటు యోగాసనాలు వేసిన అమిత్‌షా | Amit Shah Joins Baba Ramdev For Yoga Day | Sakshi
Sakshi News home page

రాందేవ్‌తోపాటు యోగాసనాలు వేసిన అమిత్‌షా

Published Wed, Jun 21 2017 8:37 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

రాందేవ్‌తోపాటు యోగాసనాలు వేసిన అమిత్‌షా - Sakshi

రాందేవ్‌తోపాటు యోగాసనాలు వేసిన అమిత్‌షా

అహ్మదాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో చేరిపోయారు. నేడు (జూన్‌ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఆయన రాందేవ్‌తో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని జీఎండీసీ గ్రౌండ్‌లో లక్షల మంది యోగాకు హాజరుకాగా ఉదయం 5.30గంటల ప్రాంతంలో మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా అమిత్‌షా కూడా రాందేవ్‌తోపాటు యోగాసనాలు వేశారు. మరోపక్క, ప్రధాని నరేంద్రమోదీ ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 50వేలమంది మధ్య యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఢిల్లీలోని కనౌట్‌ ప్రాంతంలో యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి తర్వాత ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement