పుదుచ్ఛేరి ప్రభుత్వం ప్రత్యేక తరగతుల(ఎస్సీ) కుటుంబాలకు మరింత బాసటగా నిలిచింది. ఆ కుటుంబాలకు ఇప్పటికే ఇస్తున్న అంత్మక్రియల ఖర్చులు రూ.5 వేల నుంచి పదివేలకు పెంచింది. ఈ తరహా సహాయాన్ని అందించే చట్టాన్ని ఆ ప్రభుత్వం 1982లో తీసుకొచ్చింది. దీంతోపాటు ఎస్సీ కుటుంబాల్లోని రోగులకు, అసలు సంపాదించలేనివారికి నెల భత్యంగా ఇస్తున్న రూ.500ను రెండు వేల రూపాయలకు పెంచింది.