మోడీని వాజ్ పేయి తొలగించాలనుకున్నారు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. 2002 మత ఘర్షణల తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్రమోడీని తొలగించాలని అప్పటి ప్రధాని వాజ్ పేయి అనుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. వాజ్ పేయికి సరితూగే నేతలు బీజేపీలో లేరని ఓ కథనాన్ని కాంగ్రెస్ పార్టీ తన వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల కారణంగానే యూపీఏ చేతిలో బీజేపీ ఓటమి పాలైందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీజేపీ బహిషృత నేత జస్వంత్ సింగ్ తెలిపారంటూ కథనంలో తెలిపారు.
అయితే వాజ్ పేయి వ్యాఖ్యల పేరుతో మోడీపై విమర్శలు చేయడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. వాళ్ల నేతలను మరిచిపోయి బీజేపీ నేతలను కాంగ్రెస్ నేతలు పొగడుతున్నారని సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. అద్వానీ, అటల్ జీ, సుష్మా పేర్లు తప్పితే..వాళ్ల నాయకుల పేర్లు వారికి గుర్తు రావడం లేదని వెంకయ్య చురకలంటించారు.