కాగ్ శశికాంత్ శర్మ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఆడిట్ చేసే యోచనలో ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) శశికాంత్ శర్మ తెలిపారు. ప్రభుత్వ పన్నుల రాబడులపైనా నోట్ల రద్దు ప్రభావాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆయన మాట్లాడు తూ.. ‘పెద్ద నోట్ల రద్దు ప్రభావానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆడిట్ నిర్వహించాలని యోచి స్తున్నాం. ప్రధానం గా పన్ను రాబడులపై నోట్ల రద్దు ప్రభావంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం..’ అని శశికాంత్ శర్మ పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు గానూ ఇప్పటికే రెవెన్యూ ఆడిట్ ఏర్పాట్లను పునర్వ్యస్థీకరణ చేస్తున్న ట్లు చెప్పారు. కాగా, నోట్ల ముద్రణ వ్య యం, ఆర్బీఐ డివిడెండ్ చెల్లింపులు, బ్యాంక్ లావాదేవీల సమాచారం తదితరాలపై కాగ్ దృష్టి పెట్టే అవకాశముందని నిఫుణులు చెబుతున్నారు.
నోట్ల మార్పిడి సమాచారం ఇవ్వలేం
మార్చి 31 వరకూ రద్దయిన నోట్లు మార్చుకునేందుకు ప్రధాని ఇచ్చిన హామీ విషయంలో సమాచారం ఇవ్వడానికి ఆర్బీఐ నిరాకరించింది. అది ‘సమాచారం’ కిందకు రాదని సమాధానంగా తెలిపింది. ప్రధాని ఇచ్చిన గడువు అమలు చేయకపోవడానికి గల కారణాలు తెలపాలంటూ ఆర్టీఐ దరఖాస్తు దారుడు కోరాడు.
నోట్ల రద్దు ప్రభావంపై ఆడిట్!
Published Mon, Mar 27 2017 2:54 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
Advertisement