
నల్లధనంపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్!
నల్లధనాన్ని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై జాతీయ నేతల నుంచి హర్హం వ్యక్తమవుతోంది. దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతోన్న అవినీతిని రూపుమాపే క్రమంలో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం మనుగడలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ స్పందించారు. రూ.500, వెయ్యి రూపాయిల నోట్ల రద్దును స్వాగతించిన రాష్ట్రపతి.. ఈ ప్రక్రియను బోల్డ్ స్టెప్ అని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రధాని గొప్ప నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఈ విషయంపై ట్వీట్ చేశారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిషా జాతీయ మీడియాతో కరెన్సీ రద్దుపై మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని అభివర్ణించారు. ఈ చర్య సమాజం లో సమాంతర ఆర్ధిక వ్యవస్థ, ఎన్నికల్లో ధన ప్రవాహం, తీవ్రవాదుల ఆర్ధిక మూలలను పెకలించి వేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య ట్వీట్ చేశారు. నల్లధనం, అవినీతిపై సర్జికల్ స్ట్రైక్ జరిగిందని అమిత్ షా అన్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లు చెల్లవని, ఎవరిదగ్గరైనా రూ.500, రూ.1000 నోట్లు ఉంటే వారు డిసెంబర్ 30 లోగా ఆయా నగదును బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేయాలని ప్రధాని తెలిపారు. ఎప్పటి నుంచో ఊరిస్తోన్న రూ.2000 నోటుకు కూడా ఆర్బీఐ నేడు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ అమలులో భాగంగా బుధ, గురువారాలలో ఏటీఎం సెంటర్లు పనిచేయవని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు.
By doing away with the Rs 1000 & 500 notes the PM has dealt a big blow to the flow of counterfeit currency and black money in Indian economy
— Rajnath Singh (@rajnathsingh) 8 November 2016
Demonetisation of Rs.500 & Rs.1000 is aimed at rooting out black money #IndiaFightsCorruption 1/
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 8 November 2016