
బాపు
చెన్నై: ప్రఖ్యాత చిత్రకారుడు, సాహితీవేత్త, కార్టూనిస్ట్, సినిమా దర్శకుడు బాపు అంత్యక్రియలు రేపు జరుగుతాయని ఆయన సోదరుడు సత్తిరాజు శంకర నారాయణ చెప్పారు. కొన్ని రోజులుగా బాపు తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లు తెలిపారు. తీవ్ర గుండెపోటుతో ఆయన మరణించినట్లు శంకర నారాయణ తెలిపారు.
బాపు చెన్నైలోని మల్లాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాపు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 12 హిందీ చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.