ప్రధాని మోదీకి బీడీ కార్మిక సంఘం వినతి
న్యూఢిల్లీ: భారత్‌లో పొగాకు చట్టాలను విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేలా లాబీయింగ్ చేస్తాంటూ 39 ఎన్‌జీవోలు కోట్ల రూపాయల నిధులు తీసుకున్నారని, దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలంటూ బీడీ కార్మిక సంఘం ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహా సంఘ్(ఏబీబీఎంఎంఎస్) అధ్యక్షుడు కలల్ శ్రీనివాస్ ప్రధానికి లేఖ రాశారు.
మీడియా, ప్రజాప్రతినిధులు, చట్టాలు రూపొందించే వారిని ప్రభావితం చేసే విదేశీ మల్టీనేషనల్ సిగరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను మార్పు చేసేలా ఈ ఎన్‌జీవోలు ఒత్తిడి తెచ్చాయన్నారు. ఇందుకుగాను విదేశాల నుంచి సుమారు రూ.173 కోట్లను ఫండ్ రూపంలో పొందాయని ఆరోపించారు.
అలాగే ఆరోగ్యం కోసం స్థానిక సిగరెట్ డబ్బాపై 85 శాతం ‘హెచ్చరిక బొమ్మ’ ఏర్పాటు చేయడం కూడా అక్రమ దిగుమతికి కారణం అవుతోందని శ్రీనివాస్ అన్నారు. ఈ ఎన్‌జీవోలపై వెంటనే దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. కాగా ఎఫ్‌ఐసీసీఐ తాజా అంచనా మేరకు దేశంలోని మొత్తం సిగరెట్ వ్యాపారంలో 20.2 శాతం అక్రమంగా సాగుతుండగా, దీని వల్ల రూ.9 వేల కోట్లు ప్రభుత్వం నష్టపోతోంది.
ఎన్‌జీవోలపై దర్యాప్తు చేపట్టండి
Published Thu, Jun 30 2016 8:12 PM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement