Beedi Workers Union
-
ఎన్జీవోలపై దర్యాప్తు చేపట్టండి
ప్రధాని మోదీకి బీడీ కార్మిక సంఘం వినతి న్యూఢిల్లీ: భారత్‌లో పొగాకు చట్టాలను విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేలా లాబీయింగ్ చేస్తాంటూ 39 ఎన్జీవోలు కోట్ల రూపాయల నిధులు తీసుకున్నారని, దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలంటూ బీడీ కార్మిక సంఘం ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహా సంఘ్(ఏబీబీఎంఎంఎస్) అధ్యక్షుడు కలల్ శ్రీనివాస్ ప్రధానికి లేఖ రాశారు. మీడియా, ప్రజాప్రతినిధులు, చట్టాలు రూపొందించే వారిని ప్రభావితం చేసే విదేశీ మల్టీనేషనల్ సిగరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను మార్పు చేసేలా ఈ ఎన్జీవోలు ఒత్తిడి తెచ్చాయన్నారు. ఇందుకుగాను విదేశాల నుంచి సుమారు రూ.173 కోట్లను ఫండ్ రూపంలో పొందాయని ఆరోపించారు. అలాగే ఆరోగ్యం కోసం స్థానిక సిగరెట్ డబ్బాపై 85 శాతం ‘హెచ్చరిక బొమ్మ’ ఏర్పాటు చేయడం కూడా అక్రమ దిగుమతికి కారణం అవుతోందని శ్రీనివాస్ అన్నారు. ఈ ఎన్జీవోలపై వెంటనే దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. కాగా ఎఫ్ఐసీసీఐ తాజా అంచనా మేరకు దేశంలోని మొత్తం సిగరెట్ వ్యాపారంలో 20.2 శాతం అక్రమంగా సాగుతుండగా, దీని వల్ల రూ.9 వేల కోట్లు ప్రభుత్వం నష్టపోతోంది. -
పుర్రె గుర్తుపై కదం తొక్కిన కార్మికులు
మెట్పల్లి: కరీంనగర్ జిల్లాలో బీడీ కార్మికులు కదం తొక్కారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తుతోపాటు 85 శాతం డేంజర్ మార్కును తొలగించాలని ఏఐటీయూసీ అనుబంధ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సోమవారం మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన వందలాది మంది బీడీ కార్మికులు చావిడి నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ చౌరస్తాకు వచ్చి అక్కడ రాస్తారోకో చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్త బస్టాండ్ చేరుకొని మరోమారు రాస్తారోకో నిర్వహించారు. తర్వాత తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బీడీ పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారని, పుర్రె, డేంజర్ గుర్తుల వల్ల బీడీల అమ్మకాలు కార్మికులు రోడ్డున పడతారని అన్నారు. అలాగే బీడీ కట్టలపై పుర్రె, డేంజర్ బొమ్మలను 85శాతం మేరకు ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ బీడీ కార్మికులు గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కథలాపూర్, కోనరావుపేట తహశీల్దార్ కార్యాలయూల ఎదుట ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్లకు అందజేశారు. ఎల్లారెడ్డిపేటలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కథలాపూర్ మండలంలోని 18 గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయూలని డిమాండ్ చేశారు. కోనరావుపేటలోనూ తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
కదంతొక్కిన బీడీ కార్మికులు
►బీడీ కంపెనీ బ్రాంచి కార్యాలయం ముట్టడి ►సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన దిలావర్పూర్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దిలావర్పూర్, కుంటాల, సారంగాపూర్, మామడ, లోకేశ్వరం, నిర్మల్ మండలాలకు చెందిన దాదాపు 2వేల మంది బీడీ కార్మికులు దిలావర్పూర్ మండలంలోని రాంపూర్‌లో శివాజీ బీడీ కంపెనీ బ్రాంచి కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ, శివాజీ బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు మాత్రమే చెల్లిస్తూ పీఎఫ్ ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ డివిజన్లోని 6 వేలకు పైగా ఉన్న కార్మికులకు నేటికీ పీఎఫ్ సౌకర్యం కలుగజేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీడీ కార్మికులకు రూ.1000 భృతి కూడా పీఎఫ్ లేని కారణంగా దక్కని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు వైద్యం, వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. కార్మికులందరికీ పీఎఫ్ చెల్లుబాటయ్యేలా చూసి, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా అధికారులు, ప్రభుత్వం స్థానిక బీడీ కంపెనీపై ఒత్తిడి తేవాలని కోరారు. అనంతరం బ్రాంచి మేనేజరుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా నాయకులు సుమేగ్, పీవోడబ్ల్యూ కార్యదర్శి కె.లక్ష్మి, నాయకులు హరిత, దేవక్క, అమ్మాయి, ఆయా మండలాల బీడీ కార్మికులు పాల్గొన్నారు.