ఫేస్‌బుక్‌లో మరణ వాంగ్మూలం | Bengaluru man upload suicide note in facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో మరణ వాంగ్మూలం

Published Sun, Apr 17 2016 9:27 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

ఫేస్‌బుక్‌లో మరణ వాంగ్మూలం - Sakshi

ఫేస్‌బుక్‌లో మరణ వాంగ్మూలం

విఫల ప్రేమికుడి ఆవేదన భరిత ప్రసంగం

సాక్షి, బళ్లారి: తన మరణానికి లవ్ బ్రేకప్ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు అందుకు గల కారణాలను వీడియో రూపం రికార్డుచేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. వివరాలు... హులిమావు బెంగళూరు నగం హులిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అరుణకుమార్ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలో అతడు మూడు రోజుల నుంచి అన్యమనస్కకంగా ఉన్నాడు.

శనివారం రోజు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన అరుణ్‌కుమార్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు తన ప్రేమ విఫలమైన విషయం.. శనివారం నాటి సంఘటనలు మొత్తం రెండు వీడియోలను తన మాటల ద్వారా రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు వచ్చి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement