పట్నా : సచివాలయ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ ధరించి విధులకు హాజరుకారాదని నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు కేవలం సౌకర్యవంతంగా, సింపుల్‌గా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలని కోరింది. కార్యాలయ సంస్కృతికి విరుద్ధమైన దుస్తులతో అధికారులు, ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్నట్టు గమనించామని..కార్యాలయ నిబంధనలకు ఇది విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహదేవ్ ప్రసాద్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతిఒక్కరూ సంప్రదాయ వస్త్రధారణతోనే కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులు సౌకర్యవంతంగా, సింపుల్‌గా ఉండే లేత రంగు దుస్తుల్లో విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment