అమ్మాయిల మాయంపై 12 జిల్లాల్లో వెతుకులాట
అమ్మాయిల మాయంపై 12 జిల్లాల్లో వెతుకులాట
Published Tue, Jul 8 2014 4:45 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
"హర్యానా అబ్బాయిలకు బీహారీ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయిస్తాం" అని హర్యానా బిజెపి నేత ఓపీ ధన్ కడ్ అనడంతో బీహార్ ప్రభుత్వం ఒక్కసారిగా మేల్కొంది. అసలెందరు బీహారీ అమ్మాయిలను హర్యానా అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేశారు? వారి పరిస్థితేమిటో కనుక్కొమ్మని బీహార్ ప్రభుత్వం 12 జిల్లాల పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడు ముజఫర్ పూర్, బెగూసరాయ్, పూర్ణియా, సహర్సా, సీతామఢి, ముంగేర్, అరారియా, పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారన్, కిషన్ గంజ్, మధుబని, కటిహార్ జిల్లాల్లో హడావిడిగా అధికారులు సర్వేను చేపడుతున్నారు. అమ్మాయిలను తరలించే ముఠాలేవైనా ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటామని వారంటున్నారు.
హర్యానాలో స్త్రీశిశు హత్యలు, భ్రూణ హత్యల వల్ల జనాభాలో మహిళల నిష్పత్తి తక్కువగా ఉంది. దీని తో అక్కడ మగవారికి అమ్మాయిలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ధన్ కడ్ మేం బీహారీ అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్లి చేయిస్తాం అని ఒక సభలో అన్నారు. అదిప్పుడు వివాదమై కూర్చుంది.
Advertisement
Advertisement