
పట్నా: బిహార్ పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఓ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మే 28న బిహార్ స్పెషల్ బ్రాంచ్ సూపరిండెంట్.. డీఎస్పీలను ఆదేశిస్తూ ఈ లేఖను జారీ చేశారు. దానిలో ఆర్‌ఎస్‌ఎస్, దాని 18 అనుబంధ సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ఖజానా, జాయింట్ సెక్రటరీ మరియు ఇతర కార్యకర్తల పేర్లు, వారి చిరునామాలను సేకరించాల్సిందిగా లేఖలో ఆదేశించారు. వారం రోజుల్లోగా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని లేఖలో పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలపాల గురించి ఆరా తీయమనడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. అయితే ఈ వివరాలు సేకరణ వెనక ఉన్న కారణం మాత్రం తెలియడం లేదు.