
పిట్టలు రాలిపోయాయి
పిట్టల్లా రాలిపోవడం అని ఒక సామెత వాడుతుంటాం. అదేమిటో తెలిపేలా ఉంది ఈ దృశ‍్యం. నీటి చుక్క లేక దప్పికతో పిట్టలు మృత్యువాతపడ్డాయి. ఎండుటాకులు నేల రాలినట్లున్న ఈ దృశ్యం మహారాష్ట్రలోని లాతూర్‌లోనిది. హృదయవిదారకమైన ఈ దృశ్యాన్ని సమీపంలోని ప్రజలు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితి ఎలా ఉందో ఈ చిత్రం చేస్తే అర్థమవుతుంది.