
జానకీ దేవి భౌతికకాయానికి రాజ్‌నాథ్ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాతృమూర్తి వారణాసి జానకీ దేవి(81) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన జానకీ దేవి చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర బీజేపీ నేతలు ఇక్కడి రాంమాధవ్ నివాసంలో ఉంచిన జానకీ దేవి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. జానకీ దేవి అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరుగుతాయని పార్టీ కార్యాలయ కార్యదర్శి మహేంద్ర పాండే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment