mother passaway
-
ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాతృ వియోగం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి మృతి చెందారు. ఆయన తల్లి సరళమ్మ శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. సంగం మండలం పడమటిపాళెంలో శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. విషాదంలో పడమటిపాళెం సంగం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి కోటంరెడ్డి సరళమ్మ (72) మృతితో సంగం మండలం పడమటిపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె గతంలో తమకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. రోదించిన ఎమ్మెల్యే తల్లి మృతి చెందారనే సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పడమటిపాళేనికి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కన్నీరు పెట్టడం చూసి గ్రామస్తులు, స్నేహితులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. రెండో కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరళమ్మ మృతదేహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసునాయుడు, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సంతాపం వ్యక్తం చేసిన మంత్రి మేకపాటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ ఆకస్మిక మృతికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలను కుటుంబంలా చూసుకునే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధైర్యంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. నివాళులర్పించిన కాకాణి నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ పార్థివదేహానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంగం మండలం పడమటిపాళెంలో నివాళులర్పించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
అలీకి మాతృవియోగం
ప్రముఖ హాస్యనటుడు అలీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతన్ బీబీ (75) అనారోగ్యంతో మృతిచెందారు. రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె అనారోగ్యంతో ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.41కి కన్నుమూశారు. జైతన్ బీబీ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని అలీ స్వగృహానికి తీసుకొచ్చారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ తన తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కి చేరుకున్నారు. తల్లి పట్ల అలీకి ఉన్న ప్రేమానురాగాల గురించి తెలిసిందే. తల్లితో తన అనుబంధం గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. జైతన్ బీబీకి ఐదుగురు సంతానంలో పెద్ద కుమారుడు అలీ, రెండో కుమారుడు ఖయ్యుం కాగా ముగ్గురు అమ్మాయిలు. జైతన్ బీబీ మరణవార్త తెలుసుకున్న చిరంజీవి.. అలీ ఇంటికెళ్లి ఆమెకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు సినీ, టీవీ, రాజకీయ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు జైతన్ బీబీ మృతికి సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. పరామర్శిస్తున్న చిరంజీవి -
దర్శకుడు ధవళ సత్యంకు మాతృవియోగం
విప్లవ చిత్రాల దర్శకునిగా ఎంతో పేరు సంపాదించారు దర్శకుడు ధవళ సత్యం. శనివారం ఉదయం నర్సాçపూర్లో ఆయన తల్లి సరస్వతి (86) తుది శ్వాస విడిచారు. ఆమెకు నలుగురు కుమారులు. ముగ్గురు కుమారులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఒక కుమారుడు నర్సాపూర్‌లో కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సరస్వతి అంత్యక్రియలు శనివారం నర్సాపూర్‌లో నిర్వహించారు. -
చంద్రబోస్‌కి మాతృవియోగం
ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగిరికి చెందిన చంద్రబోస్ తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు కాగా తల్లి మదనమ్మ గృహణి. వీరికి నలుగురు కుమారులు. అందరిలో చిన్నవాడు చంద్రబోస్. గతంలో ఓ సారి తన తల్లి గురించి చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు తల్లితో కలిసి మా గ్రామంలో ప్రదర్శించే ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూసేవాణ్ణి. వాటి వల్లే పద్యాలు, పాటలపై ఆసక్తి పెరిగింది. నేను పాటల రచయిత కావడం వెనక అమ్మ స్ఫూర్తి ఎంతో ఉంది’’ అన్నారు. కాగా చల్లగిరిలో మదనమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ‘‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ... కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ’ అంటూ ‘నాని’ సినిమాలో తల్లి గురించి చంద్రబోస్ ఓ అద్భుతమైన పాట రాశారు. ఆ పాట అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఎవర్గ్రీన్. -
రాంమాధవ్‌కు మాతృవియోగం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాతృమూర్తి వారణాసి జానకీ దేవి(81) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన జానకీ దేవి చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర బీజేపీ నేతలు ఇక్కడి రాంమాధవ్ నివాసంలో ఉంచిన జానకీ దేవి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. జానకీ దేవి అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరుగుతాయని పార్టీ కార్యాలయ కార్యదర్శి మహేంద్ర పాండే తెలిపారు. -
ఏపీ డీజీపీకి మాతృవియోగం
తాడిమర్రి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి జాస్తి గోవిందమ్మ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని శనివారం స్వగ్రామం అయిన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్శింపల్లికి తీసుకొచ్చారు. డీజీపీ బంధు, మిత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తదితర ప్రముఖులు హాజరై సంతాపం తెలిపి నివాళులార్పించారు. సాయంత్రం 5 గంటలకు వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు. అంత్యక్రియలల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, అదనపు డీజీపీ ఠాగూర్, ఐజీ గోపాల్‌క్రిష్ణ, డీఐజీ సత్యనారాయణ, కర్నూల్ రేంజ్ డీఐజీ రమణమూర్తి, జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, జేసీ లక్ష్మీకాంతం, ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు గోనుగుంట్ల సూర్యనారాయణ, ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆర్డీటీ ప్రోగ్రామ్ డెరైక్టర్ మంచూ ఫై, డీఎస్పీ మల్లికార్జున, ఆర్డీవో చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.