మైనస్ + మైనస్ = మైనస్ | Minus + Minus is = Minus: Rajnath Singh on SP-Congress alliance | Sakshi
Sakshi News home page

మైనస్ + మైనస్ = మైనస్

Published Fri, Feb 10 2017 11:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మైనస్ + మైనస్ = మైనస్ - Sakshi

మైనస్ + మైనస్ = మైనస్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘోరపరాజయం చవిచూస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమిని మైనస్ ప్లస్ మైనస్ ఈక్వల్ టు మైనస్‌గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని రాజ్‌నాథ్‌ విమర్శించారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీ ఏమాత్రం ప్రభావం చూపబోదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఆఖరి పోరాటం చేస్తోందని చెప్పారు.

యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని రాజ్‌నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంగా ఉన్నారని, యూపీలో మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని బీజేపీ సాధిస్తుందని ఓ ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement