విమాన వీఐపీ కల్చర్లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చిక్కుకున్నారు. ఆయన వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో మరో విమానంలో పంపేందుకు అధికారులు ప్రయత్నం చేశారు.
న్యూఢిల్లీ: విమాన వీఐపీ కల్చర్లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చిక్కుకున్నారు. ఆయన వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో మరో విమానంలో పంపేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ కుటుంబాన్ని దించేసి మరి రిజిజు బృందాన్ని అధికారులు పంపించారు.
అయితే, కేంద్ర మంత్రి రిజిజు కోసం ముగ్గురిని దించేస్తున్నప్పుడు కెమెరాతో ఓ ప్రయాణికుడు వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో మంత్రి తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తాయి. వీఐపీ కల్చర్పై నెటిజన్లు మండిపడ్డారు. జూన్ 24న ఆయన కశ్మీర్లోని లేహ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించారు.