హర్యానాలో బీజేపీ జయభేరి
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించింది. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజార్టీని బీజేపీ సాధించింది.
హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలుండగా, బీజేపీ 47 సీట్లు కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఐఎన్ఎల్డీ 19 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగా, హెచ్జేసీ రెండు, ఇతరులు ఏడు సీట్లు నెగ్గారు. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేయడం ఆ పార్టీకి కలసివచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం, మోడీ ప్రచారం ఆ పార్టీకి అధికారం కట్టబెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు