రక్తపరీక్షలు
ఖార్గాన్: మధ్యప్రదేశ్‌లోని భిఖాన్‌గాన్ నగరంలో ఓ స్వచ్ఛంద సంస్థ 6 గంటల్లోనే 2,501 మందికి రక్త పరీక్షలు నిర్వహించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదిం చింది. లక్ష్య పరివార్ అనే సంస్థ వాలంటైన్స్ డే సందర్భంగా బుధవా రం ఈ కార్యక్రమం నిర్వహించింది.
దీంతో అంతకుముందు అమెరికా లోని కాలిఫోర్నియాలో ఆరు గంటల్లో 1,460 మందికి రక్తపరీక్షలు నిర్వహిం చి నెలకొల్పిన రికార్డు కనుమరు గైందని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీశ్ వైష్ణోయ్ అన్నారు. రక్త పరీక్షల్ని తమ టీం కెమెరాలతో రికార్డు చేసిందని వెల్లడిం చారు. సంస్థ కన్వీనర్ చందనా శర్మకు వైష్ణోయ్ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment