సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎన్ఎం) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2017-18 నాటికి మూడు సంవత్సరాలకు రూ. 9,046.17 కోట్లు బడ్జెట్‌ను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రకటించారు. రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లల జననాలు తదితర పోషకాహార సంబంధింత అంశాలపై ఎన్ఎన్ఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. పిల్లలు, మహిళల్లో రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లల జననాలు తదితర పోషకాహార సంబంధింత అంశాలపై ఎన్ఎన్ఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల ద్వారా 2020 నాటికి పోషకాహార సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్టు జైట్లీ వెల్లడించారు.
ఒక అపెక్స్ బాడీ, ఎన్‌ఎన్‌ఎం పర్యవేక్షణలో పరిశీలన, లక్ష్యాలు, పోషకాహార సంబంధిత అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖలలోమార్గనిర్దేశనం చేస్తుంది. దీంతోపాటు తక్కువ పోషకాహారం, రక్తహీనత, తక్కువ బరువు గల పిల్లలు జననం లాంటి అంశాలను తగ్గించడానికి కృషి చేస్తుంది. మెరుగైన పర్యవేక్షణకు, సకాలంలో చర్యల కోసం హెచ్చరికలను జారీ చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకునే ఎన్ఎన్ఎం వ్యవహరిస్తుంది. అలాగే లక్ష్యాల సాధనలో మంత్రిత్వశాఖలతో పాటు గైడ్ చేస్తుంది. అవసరమైన పోషణ సంబంధిత సమస్యల గురించి కూడా హెచ్చరిస్తుంది.
#Cabinet approves setting up of National Nutrition Mission pic.twitter.com/XxOsmu8Xeh
— Frank Noronha (@DG_PIB) December 1, 2017
Comments
Please login to add a commentAdd a comment