పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్
* రూ.8వేల కోట్లతో ఉజ్వల యోజన
* మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి
* కేబినెట్ పచ్చజెండా
న్యూఢిల్లీ: నిరుపేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్లను అందించేందుకు ఉద్దేశించిన రూ.8 వేల కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈమేరకు ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’కు పచ్చజెండా ఊపిందని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మీడియాకు చెప్పారు.
ఈ నిధులను మూడేళ్లలో వినియోగిస్తామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న మహిళలకు యుద్ధప్రాతిపదికన గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం దీని ఉద్దేశం. ఒక్కో కనెక్షన్‌కు రూ. 1,600 ఆర్థిక సాయం లభిస్తుంది. దీనిపై 2016-17 బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 1.5 కోట్ల మందికి, మూడేళ్లలో మొత్తం 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్‌కనెక్షన్లు ఇస్తామన్నారు.
* బంగాళా ఖాతం తీర దేశాలైన బిమ్స్‌టెక్ (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్)లో నేరపరమైన అంశా ల్లో న్యాయ సహాయం ఇచ్చిపుచ్చుకునే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
* బహుళ పోషక ఫెర్టిలైజర్ అయిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉత్పాదకతను ప్రోత్సహించేం దుకు ప్రస్తుతమున్న కనీస సామర్థ్య వినియోగం నిబంధనను కేబినెట్ ఎత్తివేసింది. దీంతో ఎస్‌ఎస్‌పీని ఉత్పత్తి చేసే చిన్న కంపెనీలూ సబ్సిడీని పొందేందుకు వీలవుతుంది. గతంలో గుర్తించిన ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 50 శాతం ఉత్పత్తి చేసే కంపెనీలకే రాయితీ పొందే అర్హత ఉండేది. దీంతోచిన్న కంపెనీలకు కష్టంగా ఉండేది. చౌక రసాయన ఎరువుల్లో ఒకటైన ఎస్‌ఎస్‌పీ.. పప్పుధాన్యాలు, ఆయిల్ సీడ్స్, కూరగాయలు, చెరకు వంటి పంటలకు అనువుగా ఉంటుంది.