సోనియాపై కేసు కోర్టు బయటే పరిష్కారం
తిరువనంతపురం: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై నమోదైన సివిల్ కేసును కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కోర్టు బయటే పరిష్కరించుకుంది. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్(ఆర్‌జీఐడీఎస్) నిర్మాణానికి సంబంధించిన రూ. 2.80 కోట్లను చెల్లించలేదని ఓ నిర్మాణ సంస్థపై కేసు పెట్టడం తెలిసిందే.
సివిల్ కేసును కోర్టు బయట సెటిల్ చేసుకున్నామని, ఈ విషయాన్ని ఇరు పక్షాలు కోర్టుకు తెలియజేశాయని ఆర్‌జీఐడీఎస్ డెరైక్టర్, కేసీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి హిదుర్ ముహమద్ తెలిపారు. సోనియాను ఇందులోకి లాగడం ద్వారా స్వార్థ ప్రయోజనాల కోసం కుట్ర జరిగిందని ఆరోపించారు. ఆర్‌జీఐడీఎస్.. సొసైటీ చట్టం ప్రకారం రిజిస్టరైన సొసైటీ అని, సోనియా ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ సభ్యులు కాదని పేర్కొన్నారు. సోనియాకు ఆర్‌జీఐడీఎస్‌కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.