ఎలా ఎగిరిపోనిచ్చారు? | CBI altered Vijay Mallya's lookout notice from 'detain' to just 'inform': Agency sources | Sakshi
Sakshi News home page

ఎలా ఎగిరిపోనిచ్చారు?

Published Fri, Mar 11 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

ఎలా ఎగిరిపోనిచ్చారు?

ఎలా ఎగిరిపోనిచ్చారు?

మాల్యా పరారీపై రాజకీయ దుమారం
* మోదీ ప్రభుత్వం దాటించిందన్న రాహుల్
* బ్యాంకులు ఆలస్యం చేశాయన్న జైట్లీ

న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టిన కేసు విచారణ మధ్యలో ఉండగానే లిక్కర్ రారాజు విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గురువారం అటు పార్లమెంటులోపలా, బయటా అధికార, విపక్షాలు వాగ్బాణాలు సంధించుకున్నాయి. మాల్యా దేశం నుంచి పారిపోవడానికి ప్రభుత్వం సహాయం చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడగా, బోఫోర్స్‌కేసులో ఖత్రోచీని కాంగ్రెస్ సర్కారు దేశం దాటించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు.

మాల్యా ఈనెల 2న పారిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. మాల్యా దేశం వదిలి పారిపోవడంలో ఎన్డీఏ ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. ప్రభుత్వం ఆయనకెలాంటి సాయం చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ బదులిచ్చారు. పార్లమెంటు బయట రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, మాల్యాలాంటి వారిని దేశం దాటేలా చేసి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ‘తిండి లేక ఆకలితో రొట్టె దొంగిలించిన పేదవాడిని జైల్లో పెడతారు..  దేశంలో రూ.9వేల కోట్లు దొంగిలించిన వ్యాపారవేత్తను మాత్రం ఫస్ట్‌క్లాస్‌గా దేశం దాటిస్తారు’ అంటూ ధ్వజమెత్తారు.

జైట్లీ మీడియాతో మా ట్లాడుతూ, మాల్యా విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో బ్యాంకులు జాప్యం చేశాయని, త్వరగా స్పందించి ఉంటే బాగుండేదన్నారు. మాల్యా దేశం నుంచి వెళ్లడానికి, ఖత్రోచీ భారత్ వదిలి పోవడానికి తేడా ఉందన్నారు. బోఫోర్స్ లబ్ధిదారుల్లో ఖత్రోచీ ఉన్నారని స్విట్జర్లాండ్ అధికారులు చెప్పిన తర్వాత సీబీఐ విచారణాధికారి ఖత్రోచీ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని లేఖ రాసిన రెండు రోజుల్లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖత్రోచీని దేశం దాటించిందన్నారు. కాగా, మాల్యాపై చర్యలు తీసుకోవాలంటూ తమకెలాంటి సమాచారం అందలేదని విదేశాంగ శాఖ చెప్పింది.
 
లండన్‌లో విజయ్ మాల్యా
లండన్: విజయ్ మాల్యా బ్రిటన్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర లండన్‌లోని బేకర్ స్ట్రీట్ ప్రాంతంలోని తన బంగళా నుంచి గంట ప్రయాణం దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఉన్నట్లు సమాచారం. మాల్యా గతవారం హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని సెయింట్ అల్బన్స్ సమీపంలోని టెవిన్ గ్రామంలోని తన ‘లేడీవాక్’ ఎస్టేట్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. టెవిన్‌లో ఉన్నప్పుడు పబ్‌లకు వెళ్లే మాల్యా.. ఇప్పుడు మాత్రం బయట కనిపించలేదని అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement