
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఏసీ రైళ్లలోని పంపింప్ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నారు. బోగీలో ఉండే గాలిని తరచూ మార్చేలా సరికొత్త వ్యవస్థను అమర్చనున్నారు. దీంతో కొత్త గాలి ప్రవేశించి కరోనా వ్యాప్తిని అరికడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలో గంటకు ఆరు నుంచి ఎనిమిది సార్లు మాత్రమే కొత్తగాలి బోగీలో ప్రవేశించేది. అందులో 80 శాతం గాలి అక్కడే తిరుగుతుండగా కేవలం 20 శాతం కొత్త గాలి ప్రవేశించేది. అయితే కొత్త వ్యవస్థ ద్వారా 16 నుంచి 18సార్లు కొత్త గాలి బోగిలోకి ప్రవేశి స్తుంది. ఏసీ స్థాయిని కూడా 23 నుంచి 25 డిగ్రీలకు పెంచుతామని, ఈ విధానంలో రైళ్లు ఎక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment