చెన్నైలో ఎటు చూసినా పోలీసులే | Chennai comes under security blanket | Sakshi
Sakshi News home page

చెన్నైలో ఎటు చూసినా పోలీసులే

Published Mon, Dec 5 2016 4:09 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

చెన్నైలో ఎటు చూసినా పోలీసులే

చెన్నైలో ఎటు చూసినా పోలీసులే

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులను నమ్మొద్దని ప్రజలకు చెన్నై పోలీసులు విజ్ఞప్తి చేశారు. ‘అమ్మ’ ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. చెన్నై మొత్తం ఆర్మీ, పోలీసు బలగాలతో నిండిపోయింది. జయలలిత నివాసం పొయెస్‌ గార్డన్‌ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

తమిళనాడులోని ప్రధాన నగరాల్లోనూ ముందు జాగ్రత్తగా భద్రత పెంచారు. మరోవైపు ‘అమ్మ’  కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ముంబైలోని శక్తి వినాయక ఆలయంలో అభిమానులు పూజలు చేశారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వార్తల ప్రచారంలో నిగ్రహం పాటించాలని మీడియా సంస్థలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement