నరేంద్ర మోడీతో కాంగ్రెస్కు సవాలే: చిదంబరం | Chidambaram says Narendra Modi is a challenger for Congress party | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీతో కాంగ్రెస్కు సవాలే: చిదంబరం

Published Sun, Nov 10 2013 3:18 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

నరేంద్ర మోడీతో కాంగ్రెస్కు సవాలే: చిదంబరం - Sakshi

నరేంద్ర మోడీతో కాంగ్రెస్కు సవాలే: చిదంబరం

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కాంగ్రెస్ పార్టీకి సవాలేనని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం అంగీకరించారు. ఓ రాజకీయ పార్టీగా ఈ విషయాన్ని గ్రహించామని, మోడీని తాము తేలిగ్గా తీసుకోబోమని చెప్పారు. ఆదివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మోడీని ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దించిందని అన్నారు. కాగా బహిరంగం సభల్లో మోడీ మాట్లాడే పదజాలం, అతని ఆలోచనా విధానం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల వాగ్ధానాలు చేయడం తప్ప కీలక విషయాల గురించి మోడీ మాట్లాడటం లేదని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ పార్టీ, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని చిదంబరం చెప్పారు. యువతకు పగ్గాలు అప్పగించే సమయం ఆసన్నమైందని అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. అత్యుత్తమ పాలన అందించేందుకు అర్హులైన యువకులు అందుబాటులో ఉన్నారని చిదంబరం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement