
‘వెనిజులాలో నోట్ల రద్దును రద్దు చేశారు.. మరిక్కడ’
ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల సమస్యలు అస్సలుపట్టవన్నారు.
ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల సమస్యలు అస్సలుపట్టవన్నారు. ఎవరి సలహాలు ప్రధాని పరిగణనలోకి తీసుకోరని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని దేశ ప్రజలకు పనిచేయాలని అన్నారు.
నోట్లను రద్దు చేస్తూ వెనిజులాలో నిర్ణయం తీసుకుంటే అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, దాంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పారు. కానీ, మోదీ మాత్రం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని, ఆయన అలా చేయాలని అనుకోవడం లేదని తెలిపారు.