దిగ్విజయ్ సింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం!
దిగ్విజయ్ సింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం!
Published Mon, Sep 1 2014 9:06 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జనార్ధన్ ద్వివేదిపై కాంగ్రెస్ అధిష్టానం అగ్రహం వ్యక్తం చేసింది. అనుభవజ్క్షులకు ప్రాధాన్యత ఇవ్వకుండా యువతకు పెద్దపీట వేశారని కాంగ్రెస్ అధిష్టానంపై దిగ్విజయ్, జనార్ధన్ ద్వివేది వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని పార్టీ జాతీయ కార్యదర్శి మధుసూధన్ మిస్త్నీ మీడియాతో అన్నారు.
మీడియాలో బహిరంగంగా.. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి మిస్త్రీ తప్పు పట్టారు. ఎదైనా తమ అభిప్రాయాలను పంచుకోవాలంటే యువనేత రాహుల్ గాంధీ వారికి అందుబాటులోనే ఉన్నారని ఆయన అన్నారు. కొన్ని కీలక అంశాలపై రాహుల్ మౌనంగా ఉండటం పార్టీకి నష్టం కలిగించిందని మీడియాతో గతంలో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement