న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 28,701 మంది కరోనా బారిన పడ్డారు. 18,850 మంది కోలుకోగా, 500 మంది కరోనాతో పోరాడి మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,254కి చేరింది. మరణాల సంఖ్య 23,174కి చేరింది. ప్రస్తుతం 3,01,609 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,53,470 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!)
కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇదిలావుండగా గత 13 రోజులలో దేశంలో మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. జూలై 1 నాటికి ఆ సంఖ్య 585,493గా ఉంది. దేశంలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర 2,54,427 పాజిటివ్ కేసులు, 10, 289 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు 1,38,470 కేసులు, 1,966 మరణాలతో రెండో స్థానంలో ఉండగా.. ఢీల్లీలో 1,12,494 బారిన పడగా 3,371 మరణాలు చోటుచేసుకున్నాయి. (కరోనాను ఎదుర్కొనేందుకు వంటింటి చిట్కాలు..)
Comments
Please login to add a commentAdd a comment