చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి! | Delhi girl commits suicide, expresses desire to donate organs in letter | Sakshi
Sakshi News home page

చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి!

Published Thu, May 12 2016 7:28 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి! - Sakshi

చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి!

రీమా డాక్టర్‌ కావాలనుకుంది. ఆ కలతోనే ఎంబీబీఎస్ పరీక్షలు కూడా రాసింది. కానీ, పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని మోరిస్ నగర్‌లో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ కావాలనుకున్న 17 ఏళ్ల రీమా సూద్‌ చనిపోయాక తన అవయవాలను దానం చేయాలని కోరుతూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.

మంగళవారం వచ్చిన పరీక్షల ఫలితాల్లో తాను కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మానసిక క్షోభకు గురైన ఆమె తన కుటుంబసభ్యులకు లేఖ రాసి తనువు చాలించింది. తను మంచి కూతురిని, విద్యార్థినిని కాలేకపోయినందుకు క్షమించాలని తల్లిదండ్రుల్ని ఆ లేఖలో కోరింది. అయితే, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న చిన్నచిన్న కారణాలతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement