donate organs
-
చనిపోయినా నలుగురిలో సజీవంగా నిలిచిన ఉపాధ్యాయురాలు
-
తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ
విశాఖపట్నం: పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ కుటుంబ సభ్యులు. జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామానికి చెందిన వెలమ పూర్ణకుమారి(53) తన కుమారుడుతో ద్విచక్రవాహనంపై ఈనెల 21న విశాఖ వస్తున్నారు. విశాఖ పోర్టు ఫ్లై ఓవర్‌పై వారి ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కిందపడిన పూర్ణకుమారి తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను రామ్‌నగర్‌లో కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కేర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి తలకు శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ ఈనెల 23 రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. మంత్రి అమర్నాఽథ్ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయదానం కోసం ప్రోత్సహించగా అంగీకరించారు. జీవన్‌ధాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుతో మాట్లాడి అవయదాన ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఆమె గుండె, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, లివర్ తొలగించి అవసరమైన వారి కోసం తరలించినట్లు డాక్టర్ రాంబాబు తెలిపారు. అవయదానం చేయడానికి ముందుకు వచ్చిన పూర్ణకుమారి కుటుంబ సభ్యులను డాక్టర్ రాంబాబు అభినందించారు. పూర్ణకుమారికి భర్త జగదీశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
తాను మరణించినా మరో ఐదుగురికి జీవితం...
మరణశయ్యపై అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి కన్నపేగు కదిలి కదిలి కలచివేస్తున్నా.. దుఃఖం పొగిలి పొగిలి తన్నుకొస్తున్నా.. తీరని కడుపుకోత దావానలంలా తనువులను దహించి వేస్తున్నా.. విధిపై ఆక్రోశం కన్నీటిధారలు కడుతున్నా.. అంతరంగాన రేగిన ఆర్తనాదం నిశ్శబ్దంగా దేహాలను కంపింపజేస్తున్నా.. గుండెలను పిండేసే పెనువిషాదాన్ని పంటిబిగువనే భరిస్తూ ఆ తల్లిదండ్రులు కొండంత ఔదార్యం చూపారు. తమ కొడుకు చనిపోయినా మరికొందరికి పునర్జన్మనివ్వాలని తలంచారు. అవయవదానానికి అంగీకరించి ఆదర్శమూర్తులుగా నిలిచారు. గుంటూరు మెడికల్, చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా రాజు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. రాజు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముతూ, ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ప్రథమ సంతానం కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సంతోష్ తొమ్మిదో తరగతి, మూడో కుమారుడు అభిషేక్ 8వ తరగతి చదువుతున్నారు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కృష్ణను ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ హాస్పిటల్‌కి తరలించారు. కృష్ణకు ఈనెల 25న బ్రెయిన్ డెడ్ అయింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గుండెలవిసేలా రోదించారు. చేతికంది వచ్చిన బిడ్డ తమను చూసుకుంటాడనుకునే సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అంతటి బాధలోనూ తల్లిదండ్రులు గుండెను దిటవు చేసుకుని తమ బిడ్డ మరణం మరికొందరికి జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. కృష్ణ ఈనెల 19న తన 18వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న నాలుగురోజుల్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు, స్నేహితులు విలపిస్తున్నారు. ఐదుగురికి పునర్జన్మ కృష్ణ నేత్రాలు గుంటూరు సుదర్శిని కంటి ఆస్పత్రికి, లివర్‌ను విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్‌కు, ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్‌కు, మరో కిడ్నిని రమేష్ హాస్పిటల్‌కు, గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా, గ్రీన్‌చానల్‌లో తరలించారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఐదుగురికి జీవితాలను ప్రసాదించనున్నట్టు వైద్యులు చెబుతున్నారు. తిరుపతి వ్యక్తికి గుండె ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పందించి తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆగమేఘాల మీద హెలీకాప్టర్‌ను రప్పించి, గ్రీన్ చానెల్ ద్వారా శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు. మరణంలోనూ పరోపకారం కట్టా కృష్ణ నాకు మంచి మిత్రుడు. చిన్ననాటి నుంచి కలుపుగోలు స్వభావం కలిగినవాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. చివరకు మరణంలోనూ ఇతరులకు సహాయపడ్డాడు. మిత్రుడి మరణం తీవ్ర బాధ కలిగిస్తున్నా అతను చనిపోయినా ఇతరులకు ప్రాణదానం చేయడం గర్వంగా ఉంది. – పాలపర్తి మోహనవంశీ, స్నేహితుడు మంచితనానికి మారుపేరు కృష్ణ మంచితనానికి మారుపేరు. బంధువులందరితో కలుపుగోలుగా ఉండేవా డు. ఈనెల 19న సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్నాడు. రోజుల వ్యవధిలోనే అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్లడం మనసును కలచివేస్తోంది. అవయవ దానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితాలు ఇచ్చిన కృష్ణతో స్నేహం, బంధుత్వం పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా. – పాలపర్తి నాని, స్నేహితుడు, మేనమామ కుమారుడు -
తాను ఊపిరొదిలి, ఇతరులకు ప్రాణభిక్ష
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సోమనహళ్లి తండాకు చెందిన రక్షిత (17) బ్రెయిన్‌డెడ్ కాగా, ఆమె అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. గుండె, శ్వాసకోశం, కిడ్నీలు, మూత్రకోశ, కళ్లు తదితర 9 అవయవాలను సేకరించారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. గుండెను 9 ఏళ్లు బాలునికి అమర్చారు. తద్వారా ఆమె ఊపిరి వదులుతూ పలువురికి ప్రాణం నిలిపింది. విద్యార్థుల కన్నీటి నివాళి శ్వాసకోశాన్ని చెన్నైకి తరలించగా, మూత్రపిండాలను మంగళూరుకు పంపారు. కళ్లను చిక్కమగళూరు ఐ బ్యాంక్‌లో భద్రపరిచారు. ఆమె నుంచి సేకరించిన 9 అవయవాలను 9 మందికి అమర్చవచ్చని వైద్యులు తెలిపారు. ఆదివారం బస్సు దిగుతూ కింద పడిన రక్షిత బ్రెయిన్ డెడ్ కావడం తెలిసిందే. గురువారం ఉదయం చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు ఆమె దేహం నుంచి అవయవాలను సేకరించి భద్రపరిచారు. తరువాత రక్షిత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం బసవనహళ్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి తీసుకెళ్లి విద్యార్థుల అంతిమ దర్శనం కోసం ఉంచారు. విద్యార్థులు, బోధన సిబ్బంది రక్షితకు కన్నీటి నివాళులు అర్పించారు. రక్షిత తల్లిదండ్రుల మానవత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిస్వార్థంగా అవయవదానం చేసి పలు కుటుంబాలకు సాయం చేశారని సోషల్ మీడియాలోనూ అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: రూ. 35 కోట్లు విలువ చేసే విగ్రహం..అమెరికాలో ప్రత్యక్షం) -
నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!
సాక్షి, న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరు దోషులు తాము చనిపోయాక చేయాల్సిన పనుల గురించి జైలు సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు నెహాల్ బన్సాల్ ఉరికి గంట ముందు జైలుకి వెళ్లి దోషుల చివరి కోరికల గురించి తెలుసుకున్నారు. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ మరణానంతరం అవయవాలను దానం చేయాలని కోరాడు. అవయదానానికి అవసరమైన పత్రంపై కూడా సంతకాలు చేశాడని అధికారులు వెల్లడించారు. (చదవండి: జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!) అయితే ఉరి తీసిన అనంతరం అరగంటపాటు వారి శరీరాలను అలానే వేలాడదీయడంతో కీలక అవయవాలు దానానికి పనికిరావని తెలుస్తోంది. ముఖేష్ సింగ్ ఉరికి ముందు తనను ఉరి తీయొద్దంటూ బతిమాలాడుతూ, తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తెలుస్తోంది. మరో దోషి వినయ్ శర్మ కూడా తన మరణానంతరం.. జైల్లో ఉన్నప్పుడు తాను వేసిన పెయింటింగులను సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని కోరాడు. తాను చదివిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, తన ఫొటోగ్రాఫ్‌ను కుటుంబానికి అందించాలి కోరాడు. మిగతా ఇద్దరు పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ మాత్రం ఎలాంటి కోరికా కోరలేదని సమాచారం. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
ప్రాణభిక్ష పెట్టండి
ఆ కుటుంబానికి అతడే ఆధారం.. కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించేవాడు.. ఏ చిన్న కష్టం వచ్చినా అన్నీ తానై కుటుంబానికి అండగా నిలిచేవాడు.. అలాంటి వ్యక్తిపై విధి పగబట్టింది. తొలుత అనారోగ్యం చేయడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సూచించడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రికి చేరాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక మంచానికే పరిమితమయ్యాడు. కిడ్నీ దానం చేసేందుకు అతని మాతృమూర్తి ముందుకువచ్చినా ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని బాధితుడు మైనంపాటి నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహకరించి తనకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు. నెల్లూరు, అల్లూరు: అల్లూరు మండలం ఇందుపూరు గ్రామానికి చెందిన మైనంపాటి వెంకటేశ్వర్లు(లేట్), నాగమ్మల కుమారుడు నాగేంద్ర. వయస్సు 31 సంవత్సరాలు. అల్లూరు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాగేంద్ర నృత్య కళాకారుడు కూడా. వీరిది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించుకునేందుకు చెన్నైలో దినసరి కూలీగా పనిచేసేవాడు. నాగేంద్రకు భార్య కస్తూరి, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అంతాబాగుందనుకుంటున్న సమయంలో విధి పగబట్టింది. నాగేంద్రకు తరచూ కడుపునొప్పి వస్తుండడంతో హాస్పిటల్ చూపించుకుంటే కడుపులో 3 కిలోల కణిత ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి తీసివేయాలని చెప్పగా ఎలాగోలా తన వద్ద ఉన్న డబ్బుతో ఆపరేషన్ చేయించుకున్నాడు. డాక్టర్లు కణితి తొలగించారు. కానీ సమస్య అంతటితో అయిపోలేదు. నాగేంద్ర కిడ్నీ సంబంధిత వ్యాధికి గురయ్యాడు. రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి దీనస్థితిని అనుభవిస్తున్నాడు. ఇప్పటివరకు వైద్య చేయించుకునేందుకు రూ.3 లక్షల వరకు ఖర్చయింది. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అందుకోసం నెలకు రూ.10 వేల వరకు మందులతో సహా ఖర్చవుతోంది. అసలే నిరుపేద కుటుంబం అంత పెద్ద మొత్తం ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేక నానాఅవస్థలు పడుతున్నారు. కిడ్నీ దాతలు ముందుకు వచ్చి కిడ్నీ దానం చేస్తే తప్ప నాగేంద్ర బతకడని వైద్యులు తెలిపారు. ఆçపరేషన్ చేస్తే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో నాగేంద్ర తల్లి నాగమ్మ తన కుమారుడు పడుతున్న అవస్థను చూసి తట్టుకోలేక తన ఒక కిడ్నీని కుమారుడికి ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ కిడ్నీ మార్పిడి చేయించుకునే ఆర్థిక స్థోమత వీరికి లేదు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు దాదాపుగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక నాగేంద్ర కుటుంబసభ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన బిడ్డను బతికించాలని నాగేంద్ర తల్లి, తన భర్తను బతికించాలని కస్తూరి ప్రార్థిస్తున్నారు. నాగేంద్ర మాత్రం తన కుటుంబానికి తానే ఆధారమని, తనను బతికించాలని పరిచయమున్న ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నాడు. సాయం చేయదలచుకున్న దాతలు పూర్తి వివరాలకు సంప్రదించండి పేరు – మైనంపాటి నాగేంద్ర సెల్ – 75501 74783 బ్యాంక్ అకౌంట్ నంబర్: 34015307025 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0015069 బ్రాంచ్ పేరు: ఎస్బీఐ – అల్లూరు శాఖ ఫోన్ పే: 70970 83008 -
11 నెలల చిన్నారి అవయవదానం
చండీగఢ్: చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. తల్లిదండ్రుల అంగీకారంతో బతికే అవకాశంలేని 11 నెలల చిన్నారి కిడ్నీలను ఓ వ్యక్తికి అమర్చారు. నేపాల్‌కు చెందిన దంపతులు 11 నెలల వయసున్న తమ బాబుతో కలసి చండీగఢ్‌లో ఉంటున్నారు. జూలై 6న పిల్లాడు ఊయల నుంచి కిందపడడంతో తలకు దెబ్బతగిలి స్పృహ కోల్పోయాడు. చికిత్స కోసం పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. పిల్లాడు బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. తల్లిదండ్రుల అంగీకారంతో పిల్లాడి 2 కిడ్నీలను మరో వ్యక్తికి ఆపరేషన్‌చేసి అమర్చారు. ఆస్పత్రి చరిత్రలో అవయవదానం చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా ఈ పిల్లాడు నిలిచాడు. కిడ్నీలను చిన్నారులకే అమర్చాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఓ రోగితో బాలుడి కిడ్నీలు మ్యాచ్ కావడంతో ఆ వ్యక్తికే అమర్చారు. -
ఈ యువకుడి జీవితం అన్మోల్
అన్మోల్ అంటే.. వెలకట్టలేనిదని అర్థం. అన్మోల్ అనే పేరు పెట్టుకున్నందుకేనేమో... ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి జీవితం కూడా వెలకట్టలేనంత విలువైనదిగా మారిపోయింది. తాను మరణిస్తూ 34 మందికి జీవం పోసిన ఈ ప్రాణదాత జీవితానికి వెలకట్టడం సాధ్యమేనా? ఇంతకీ అన్మోల్ ఎవరు? 34 మందికి ప్రాణం పోయడమేంటి? తెలుసుకోవాలనుంది కదూ.. అయితే చదవండి.. మనకోసం మాత్రమే మనం బతికితే ఆ బతుకు మరణంతో సమానం. అదే ఇతరుల కోసం చనిపోయినా..అది అమరంతో సమానం. అంటే ఇతరుల కోసం చనిపోయినా.. ఆ వ్యక్తి బతికున్నవారిలో ఎప్పటికీ సజీవంగా ఉంటాడని అర్థం... ఇవి ఎవరో చెబుతున్న మాటలు కావు, వేదాలు, ఉపనిషత్తుల్లో లిఖించిన సత్యాలు. తాము బతుకుతూ ఎంతో మందిని బతికిస్తున్న గోప్పవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ.. తాను చనిపోతూ 34 మందికి ప్రాణం పోసిన అన్మోల్ గురించి విన్నారా.. ఢిల్లీకి చెందిన అన్మోల్ జునేజా జీవితం 20 ఏళ్లకే విషాదాంతమైంది. యాక్సిడెంట్ రూపంలో మృత్యువు అతణ్ని కబళించింది. అన్మోల్ కలలు, ఆశలు ఆవిరయ్యాయి. అన్మోల్ ఈ లోకంలో లేకున్నా అతని తండ్రి తీసుకున్న నిర్ణయంతో 34 మందిలో జీవిస్తున్నాడు. 2012 డిసెంబర్లో ఇంటికి వెళ్తూ తండ్రితో మాట్లాడిన కొన్ని నిమిషాలకే అన్మోల్కు యాక్సిడెంట్ జరిగింది. మధు విహార్ ఫ్లై ఓవర్ దగ్గర ట్రక్ అతణ్ని ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో అన్మోల్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల తర్వాత వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఎదిగిన కొడుకు ఇకలేడన్న దుఃఖంలోనూ అన్మోల్ తండ్రి మదన్ మోహన్ జునేజా కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అన్మోల్ అవయాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని, తద్వారా తనకొడుకును వారిలో చూసుకోవాలని భావించాడు. అన్మోల్ బ్రెయిన్ మినహా ఇతర అవయవాలను దానం చేయవచ్చని వైద్యులు సూచించగా, మదన్ అంగీకరించాడు. అన్మోల్ కళ్లను(రెటీనా, కార్నియా వంటివి) నలుగురికి దానం చేశారు. అతని కాలేయాన్ని పూర్తిగా మరో వ్యక్తి అమర్చారు. ఎయిమ్స్ వైద్య చరిత్రలో లివర్‌ను పూర్తిగా మరో వ్యక్తి అమర్చడం ఇదే తొలిసారిని అని వైద్యులు చెప్పారు. కిడ్నీలను, ఇతర కీలక అవయవాలను మరికొంతమందికి దానం చేశారు. ఇలా మొత్తం 34 మందికి అన్మోల్ అవయాలను అమర్చి వారికి కొత్తజీవితాలను ప్రసాదించారు. అన్మోల్ లివర్ అమర్చడం వల్ల ఓ మహిళా ఎస్ఐకి ప్రాణాం పోశారు. కోలుకున్న తర్వాత ఆమె కలిసినపుడు తాను ఉద్వేగానికి లోనయ్యానని అన్మోల్ తండ్రి చెప్పాడు. ఎంతోమందికి ప్రాణదానం చేసిన, చూపునిచ్చిన తన కొడుకును వారిలో చూసుకున్నానని, వారందరిని చూసినప్పుడు తనకు అన్మోల్ మాత్రమే కనిపించాడని, ముఖ్యంగా చూపు పొందినవారిని గమనించినప్పుడు వారి కళ్లు తాజ్‌మహల్ కంటే ప్రకాశవంతంగా కనిపించాయన్నాడు. అన్మోల్, అతని తండ్రి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ఎంతోమంది స్వయంగా, సోషల్ మీడియా ప్రశంసించారు. -
ప్రాణం పోయినా.. 34 మందిలో జీవిస్తున్నాడు
ఢిల్లీకి చెందిన అన్మోల్ జునేజా జీవితం 20 ఏళ్లకే విషాదాంతమైంది. యాక్సిడెంట్ రూపంలో మృత్యువు అతణ్ని కబళించింది. అన్మోల్ కలలు, ఆశలు ఆవిరయ్యాయి. అన్మోల్ ఈ లోకంలో లేకున్నా అతని తండ్రి తీసుకున్న నిర్ణయంతో 34 మందిలో జీవిస్తున్నాడు. 2012 డిసెంబర్లో ఇంటికి వెళ్తూ తండ్రితో మాట్లాడిన కొన్ని నిమిషాలకే అన్మోల్కు యాక్సిడెంట్ జరిగింది. మధు విహార్ ఫ్లై ఓవర్ దగ్గర ట్రక్ అతణ్ని ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో అన్మోల్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల తర్వాత వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఎదిగిన కొడుకు ఇకలేడన్న దుఃఖంలోనూ అన్మోల్ తండ్రి మదన్ మోహన్ జునేజా కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అన్మోల్ అవయాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని, తద్వారా తనకొడుకును వారిలో చూసుకోవాలని భావించాడు. అన్మోల్ బ్రెయిన్ మినహా ఇతర అవయవాలను దానం చేయవచ్చని వైద్యులు సూచించగా, మదన్ అంగీకరించాడు. అన్మోల్ కళ్లను నలుగురికి దానం చేశారు. అతని కాలేయాన్ని పూర్తిగా మరో వ్యక్తి అమర్చారు. ఎయిమ్స్ వైద్య చరిత్రలో లివర్‌ను పూర్తిగా మరో వ్యక్తి అమర్చడం ఇదే తొలిసారిని అని వైద్యులు చెప్పారు. కిడ్నీలను, ఇతర కీలక అవయవాలను మరికొంతమందికి దానం చేశారు. ఇలా మొత్తం 34 మందికి అన్మోల్ అవయాలను అమర్చి వారికి కొత్తజీవితాలను ప్రసాదించారు. అన్మోల్ లివర్ అమర్చడం వల్ల ఓ మహిళా ఎస్ఐ ప్రాణాలు కాపాడారు. ఆమె కలిసినపుడు తాను ఉద్వేగానికి లోనయ్యానని అన్మోల్ తండ్రి చెప్పాడు. తాజ్ మహల్ కంటే అన్మోల్ కళ్లు తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయని మదన్ కొడుకును గుర్తుచేసుకున్నాడు. అన్మోల్, అతని తండ్రి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని వైద్యులు ప్రశంసించారు. -
చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి!
రీమా డాక్టర్ కావాలనుకుంది. ఆ కలతోనే ఎంబీబీఎస్ పరీక్షలు కూడా రాసింది. కానీ, పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని మోరిస్ నగర్లో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ కావాలనుకున్న 17 ఏళ్ల రీమా సూద్ చనిపోయాక తన అవయవాలను దానం చేయాలని కోరుతూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం వచ్చిన పరీక్షల ఫలితాల్లో తాను కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మానసిక క్షోభకు గురైన ఆమె తన కుటుంబసభ్యులకు లేఖ రాసి తనువు చాలించింది. తను మంచి కూతురిని, విద్యార్థినిని కాలేకపోయినందుకు క్షమించాలని తల్లిదండ్రుల్ని ఆ లేఖలో కోరింది. అయితే, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న చిన్నచిన్న కారణాలతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అవయవదానంపై అవగాహన
త్వరలో గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం అవగాహన సదస్సులో కలెక్టర్ నీతూప్రసాద్ కరీంనగర్ : ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంపొందించేందుకు త్వరలో కరీంనగర్ జిల్లాలో గ్రామగ్రామాన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ తెలిపారు. బుధవారం అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జిల్లాలోని డాక్టర్లకు అవయవదానంపై ఆవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజల్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో త్వరలో ఎన్జీవోలు, వైద్య, ఆరోగ్య శాఖ, ఐఎంఏ సంస్థలతో కలిసి అవయవదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అవయనదానంపై ప్రజలకు ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. ఈ సందేహాలను తొలగించేందుకు వంద మంది విద్యావేత్తలతో కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అపోలో హాస్పిటల్ వారు పుష్కరాల సందర్భంగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి నాలుగైదు ప్రాణాలను కాపాడారని అభినందించారు. అపోలో రీచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ బాబురావు మాట్లాడుతూ... గురువారం జాతీయ అవయన దాన దినోత్సవం సందర్భంగా సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అవయవాలు అందక ఎన్నో మరణాలు : మనీష్ సీ.వర్మ దేశంలో ఆవయవాలు అందక ఎందరో ప్రజలు చనిపోతున్నారని అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు డాక్టర్ మనీష్ సీ.వర్మ అన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం వల్ల ఎనిమిది ప్రాణాలను కాపాడవచ్చునని చెప్పారు. ఇప్పటికి దేశంలో సంవత్సరానికి 2 లక్షల మందిలో 3500 మంది కిడ్నీ, వంద మంది గుండె, పది వేల మందిలో లివర్ తదితర అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మన దేశంలో 0.05 శాతం మంది మాత్రమే అవయవాలను దానం చేస్తున్నారని అన్నారు. అవయవాలను దానం చేయడానికి ఏ రూల్ అవసరం లేదని, బ్రెయిన్ డెత్ అయిన వారు ఎవ్వరైనా అవయవాలను దానం చేయవచ్చునని వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన్‌దాన్‌తో కలిసి అపోలో హాస్పిటల్స్ అవయవదానంపై కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మరో డాక్టర్ సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు భూంరెడ్డి, మంజునాథ్, అనమల్ల నరేష్, శ్యాంసుందర్, రఘురామన్, నరేంద్రపాల్గొన్నారు. -
తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం
పంజగుట్ట: తాను మరణిస్తూ ఓ యువకుడు తన అవయవాలు దానం చేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన సోమేశ్ చారి (35) ప్రైవేట్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 4న నల్లగొండలో ద్విచక్రవాహనంపై వెళ్తూ సోమేశ్ చారి ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు నగరంలోని కిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న సోమేశ్‌చారికి ఈనెల 11 న బ్రైయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి జీవన్‌దాన్ ప్రతినిధులు చారి కుటుంబసభ్యులను కలిసి అవయవదానం ఆవశ్యకతను వివరించారు. వారు ఒప్పుకోవడంతో సోమేశ్‌చారికి శస్త్రచికిత్స చేసి అతని శరీరంలో నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు హార్ట్‌వాల్వ్స్ సేకరించి అవసరమైన వారికి అమర్చారు. -
అందరూ అవయవ దానం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘జష్నే ఆజాదీ’ వేడుకల్లో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, వైద్యులు, సామాన్యులతో అవయవదాన ప్రతిజ్ఞ చేయించారు. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ, సంక్షేమ విభాగం సచివాల యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీంతోపాటు రాజ్‌నివాస్‌లో కూడా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్య కార్యదర్శి ఎస్.కె. శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన రక్తదానం, హెల్త్ చెకప్, కంటి పరీక్షల శిబిరాలను ఎల్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ అవయవ దానం చేయాల ని విజ్ఞప్తి చేశారు. అవయవదానాన్ని ప్రోత్సహిం చడం కోసం అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వ శాఖను ఈ సందర్భంగా కోరారు. కాగా 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నగరవాసులకు అభినందనలు తెలియజేశారు. మనకు స్వాతంత్య్రం అం దించడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిద్దామన్నారు. అందరూ గర్వించేవిధంగా నగరాన్ని తీర్చిదిద్దడానికి, పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరించాలని ఆయన ఢిల్లీవాసులను తన సందేశంలో కోరారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య సయో ద్య, సహనం, పరస్పర గౌరవాలను పెంపొందించడానికి సహకరించాలని కోరారు. అందరూ మంచి పౌరులుగా మెలగాలని ఆయన నగరవాసులకు పిలుపునిచ్చారు. -
అవయవదానానికి కపిల్ దేవ్ ప్రతిజ్ఞ
తాము మరణాంతరం అవయవ దానం చేయనున్నట్లు ప్రముఖ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీలు శనివారం న్యూఢిల్లీలో ప్రతిజ్ఞ చేశారు. అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు న్యూఢిల్లీ యూరాలజీస్ట్ సోసైటీ అధ్వర్యంలో ఏయిర్ పోర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా అఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన యూసికాన్-2014 కార్యక్రమంలో వారిరువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతదేశ జనాభా 130 కోట్లు ఉన్న వారిలో అత్యధికులకు అవయవదానంపై కనీస అవగాహన లేదని ఆ సోసైటీ అర్గనైజింగ్ సెక్రటరీ రాజీవ్ సూద్ వెల్లడించారు. దాంతో అవయవదానం చేసే వారు లేక పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలలో అవగాహన కల్పించేందుకు ' హర్ జాన్ కో అమర్ బనానా హై' అనే స్లోగన్‌తో తమ సోసైటీ నడుం కట్టినట్లు వివరించారు. అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పించడం వల్ల మరణించిన వ్యక్తులు కూడా అమరత్వం పొందుతారన్నారు.