సాక్షి, న్యూఢిల్లీ: ‘జష్నే ఆజాదీ’ వేడుకల్లో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, వైద్యులు, సామాన్యులతో అవయవదాన ప్రతిజ్ఞ చేయించారు. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ, సంక్షేమ విభాగం సచివాల యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీంతోపాటు రాజ్‌నివాస్‌లో కూడా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్య కార్యదర్శి ఎస్.కె. శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన రక్తదానం, హెల్త్ చెకప్, కంటి పరీక్షల శిబిరాలను ఎల్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ అవయవ దానం చేయాల ని విజ్ఞప్తి చేశారు. అవయవదానాన్ని ప్రోత్సహిం చడం కోసం అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వ శాఖను ఈ సందర్భంగా కోరారు.
కాగా 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నగరవాసులకు అభినందనలు తెలియజేశారు. మనకు స్వాతంత్య్రం అం దించడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిద్దామన్నారు. అందరూ గర్వించేవిధంగా నగరాన్ని తీర్చిదిద్దడానికి, పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరించాలని ఆయన ఢిల్లీవాసులను తన సందేశంలో కోరారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య సయో ద్య, సహనం, పరస్పర గౌరవాలను పెంపొందించడానికి సహకరించాలని కోరారు. అందరూ మంచి పౌరులుగా మెలగాలని ఆయన నగరవాసులకు పిలుపునిచ్చారు.
అందరూ అవయవ దానం చేయాలి
Published Thu, Aug 14 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement