భార్య, కూతుళ్లను చితకబాదిన లాయర్! | delhi lawyer thrashes wife and daughter, video goes to police | Sakshi
Sakshi News home page

భార్య, కూతుళ్లను చితకబాదిన లాయర్!

Published Thu, Dec 15 2016 10:41 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

delhi lawyer thrashes wife and daughter, video goes to police

ఆయనో న్యాయవాది. ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నాడు. ఏమైందో ఏమో గానీ.. తన భార్యను, కూతురిని విపరీతంగా తిడుతూ కొట్టాడు. తన తండ్రి ఇలా చేయడాన్ని ఆయన మరో కూతురు మొత్తం వీడియో తీసి, పోలీసులకు అందజేసింది. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ న్యాయవాది తన కూతురిని గట్టిగా కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. అతడు ఆమెను లాక్కుని వెళ్తూ, పిడిగుద్దులు కురిపించాడు. 
 
దక్షిణ ఢిల్లీలోని వసంత కుంజ్ ప్రాంతంలో ఈ న్యాయవాది కుటుంబం నివసిస్తుంది. తమకు పెళ్లయ్యి 15 ఏళ్లు అయ్యిందని, అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన తనను కొడుతూనే ఉన్నాడని న్యాయవాది భార్య తెలిపారు. తన ఇద్దరు కూతుళ్లను కూడా వదిలేవాడు కాడని అన్నారు. తనకు కొడుకులు పుట్టలేదన్న కోపంతోనే తమ ముగ్గురినీ ఇన్నాళ్లుగా కొడుతూ ఉన్నాడని చెప్పారు. పిల్లలిద్దరూ దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement