ఆరేళ్ల క్రితం కూడా ఢిల్లీ జూలో అలాంటి ఘటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ జూ దుర్ఘటన లాంటిదే గత ఆరు సంవత్సరాల క్రితం కూడా చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం పులుల ఎన్ క్లోజర్ లో పడిన ఓవ్యక్తి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఆరు సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక రకమైన మైకంలో ఉన్న ఓ వ్యక్తి సింహాల ముందు పడిపోయాడు. అయితే అతడ్ని సింహాలు ఎలాంటి హాని చేయకుండా వదలివేశాయి అని జాతీయ జూలాజికల్ పార్క్ అధికారులు తెలిపారు. ఎన్ క్లోజర్ లో పడిన వ్యక్తిని సింహాలు గమనించాయి. అయితే చంపవద్దని వేడుకోవడంతో సింహాలు వదిలివేశాయని అధికారుల తెలిపారు.