పార్లమెంట్ గేట్ వద్ద తనిఖీ వ్యవస్థకు ఎంపీల డిమాండ్ | Demand for screening of MPs in Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ గేట్ వద్ద తనిఖీ వ్యవస్థకు ఎంపీల డిమాండ్

Published Thu, Feb 13 2014 3:25 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

పార్లమెంట్ గేట్ వద్ద తనిఖీ వ్యవస్థకు ఎంపీల డిమాండ్ - Sakshi

పార్లమెంట్ గేట్ వద్ద తనిఖీ వ్యవస్థకు ఎంపీల డిమాండ్

పార్లమెంట్ గేట్ వద్ద సభ్యులందర్ని తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పార్టీలకతీతంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. లోకసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన తోపులాట, స్పీకర్ మైక్ విరిచివేత, పెప్పర్ స్పే ఘటనల నేపథ్యంలో తనఖీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యులు సూచిస్తున్నారు. 
 
ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యలకు తావులేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది మంచిది కాదు అని జేఎంఎం ఎంపీ కామేశ్వర్ బైతా అన్నారు. సభలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉభయ సభల్లోకి ప్రవేశించే సభ్యులను  పూర్తిగా తనిఖీ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయం లాంటి సభకు ఇలాంటి సంఘటనలు అగౌరవాన్ని తీసుకువస్తాయన్నారు.
 
ఉగ్రవాదుల చర్యలను తలపించేలా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా సంఘటనలున్నాయని పలువురు ఎంపీలు అన్నారు. ఈ సంఘటన తర్వాత పక్కాగా సభ్యులను తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పలు పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement