జాదవ్‌కు కార్మికశాఖ | Department of labor given to Bhaskar Jadhav | Sakshi
Sakshi News home page

జాదవ్‌కు కార్మికశాఖ

Published Fri, Jun 27 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

జాదవ్‌కు కార్మికశాఖ

జాదవ్‌కు కార్మికశాఖ

సాక్షి, ముంబై: కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భాస్కర్ జాదవ్‌కు కార్మికశాఖను అప్పగించారు. జాదవ్‌కు అప్పగిస్తారని భావించిన జలవనరులశాఖ హసన్ ముష్రిఫ్‌కు కట్టబెట్టారు. ఎన్సీపీ పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా సునీల్ తట్కరేను నియమించడంతో అప్పటిదాకా ఆ స్థానంలో కొనసాగిన భాస్కర్ జాదవ్ కు మంత్రిమండలిలో స్థానం కల్పించారు. అయితే సునీల్ తట్కరే నిర్వహించిన జలవనరులశాఖ బాధ్యతలను జాదవ్‌కు అప్పగించనున్నారని ఆ పార్టీ నేతలు గురువారం చెప్పినా అధిష్టానం మాత్రం హసన్ ముష్రిఫ్ నిర్వహిస్తున్న కార్మికశాఖను అప్పగించింది. తట్కరేకు రాష్ట్రాధ ్యక్ష పదవి దక్కడంతో ఖాళీ అయిన
 జలవనరుల మంత్రిత్వశాఖను హసన్ ముష్రిఫ్‌కు అప్పగించారు.
 
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ ఈ మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీలో జరుగుతున్న మార్పులపై కాంగ్రెస్ ఓ కన్నేసింది. ఆ పార్టీ చేస్తున్న మార్పులకు అనుగుణంగానే తమ పార్టీలో కూడా మార్పులు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఎన్నికల ప్రకటన వెలువడేనాటికి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వశాఖలో ఏ మంత్రి కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనిపై పార్టీ నేతల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే విశ్లేషకులు మాత్రం ఈ మార్పులు సత్ఫలితాలను ఇవ్వలేవని, ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తాయని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేయలేరని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement