స్కూల్ బ్యాగు భారం తగ్గనుంది: జవదేకర్
నీముచ్: విద్యార్థులపై స్కూలు బ్యాగుల భారం తగ్గించేందుకు కేంద్రం త్వరలో సరికొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్ల డించారు. పాఠశాలల్లో డిజిటల్ విధానాలు అవలంబిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
మంగళవారం మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లా జవాద్‌లో 20 హైటెక్ పాఠశాలలను ఆయన ప్రారంభించారు. ప్రతిపాదిత పథకం కింద డిజిటల్ బోర్డు, ప్రొజెక్టర్‌ను సమకూర్చుకునే పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడతామన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు సుమారు 70 లక్షల మంది ఉపాధ్యాయులు 26 కోట్ల మంది విద్యార్థులకు బోధిస్తున్నారని వివరించారు.