మనది ‘భారత్ ఆక్రమిత కశ్మీర్’: దిగ్విజయ్
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గురువారం కశ్మీర్‌ను ‘భారత్ ఆక్రమిత కశ్మీర్’గా అభివర్ణించారు. పాక్‌పై మోదీ వ్యాఖ్యలను విమర్శిస్తూ ‘భారత కశ్మీరీలతో చర్చలపై చూపే ఆసక్తి కన్నా మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ఆందోళన చెందుతున్నారు’ అని అన్నారు. కశ్మీరీలు పీఓకేకు చెందుతారా? లేక భారత ఆక్రమిత క శ్మీర్‌కు చెందుతారా? అన్న నమ్మకాన్ని చర్చల ద్వారానే వారిలో పాదుకొల్పగలమని వ్యాఖ్యానించారు. వెంటనే దిగ్విజయ్ తన తప్పును సరిదిద్దుకునే యత్నం చేశారు. మోదీ భారత కశ్మీర్‌పై కాకుండా పీఓకే గురించి బాధపడుతున్నారని చెప్పడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ సోదరీమణులకు ఇదే దిగ్విజయ్ రాఖీ పండగ బహుమతి అని బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్ ట్వీట్ చేశారు.