
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ (98) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అన్బళగన్ మృతితో పార్టీ కార్యక్రమాలను శనివారం నుంచి వారం రోజులపాటు వాయిదా వేసినట్లు డీఎంకే ప్రధాన కార్యాలయం ప్రకటించింది. అన్బళగన్ పార్థివదేహంపై డీఎంకే పతాకాన్ని కప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పార్టీనేతలు కనిమొళి, దురైమురుగన్ నివాళులర్పించారు. కరుణానిధికి మిత్రుడిగా మెలిగిన అన్బళగన్ గత 43ఏళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.