anbalagan
-
డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ (98) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అన్బళగన్ మృతితో పార్టీ కార్యక్రమాలను శనివారం నుంచి వారం రోజులపాటు వాయిదా వేసినట్లు డీఎంకే ప్రధాన కార్యాలయం ప్రకటించింది. అన్బళగన్ పార్థివదేహంపై డీఎంకే పతాకాన్ని కప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పార్టీనేతలు కనిమొళి, దురైమురుగన్ నివాళులర్పించారు. కరుణానిధికి మిత్రుడిగా మెలిగిన అన్బళగన్ గత 43ఏళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. -
ఊరటా... శిక్షా?
► ఆస్తుల కేసులో వారంలో తీర్పు ► పోయెస్‌గార్డెన్ లో కలకలం ► శిక్షపడితే ఆపద్ధర్మ సీఎం ఎవరో? మరో రెండు రోజుల్లో సీఎం కుర్చీ ఎక్కబోతున్న శశికళను ఆదాయానికి మించిన ఆస్తుల కేసు భయపెడుతోంది. మరో వారం రోజుల్లో తీర్పు వెలువడనుంది. ఆస్తుల కేసు నుంచి శశికళకు ఊరట లభించేనా లేక శిక్ష పడేనా, శిక్షే ఖాయమైన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరని రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఆదాయానికి మించి రూ.66 కోట్ల ఆస్తులను కూడబెట్టారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యస్వామి, డీఎంకే పెట్టిన కేసుపై చెన్నై, బెంగళూరు కోర్టుల్లో 18 ఏళ్లపాటూ విచారణ సాగింది. ఈ కేసుపై 2014 సెప్టెంబరు 27న తీర్పు చెప్పిన బెంగళూరు ప్రత్యే క కోర్టు జయ సహా నలుగురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక జయలలిత రూ.100 కో ట్లు, మిగిలిన ముగ్గురు రూ.10 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు మేరకు జయ సహా నలుగురూ కొన్ని రోజులు బెంగళూరు అగ్రహార జైలులో శిక్షను అనుభవించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేయగా, నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి కుమారస్వామి 2015 మే 11వ తేదీన తీర్పు చెప్పా రు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. తీర్పు ఇచ్చే సమయంలో జయ తదితరులు పాల్పడిన కొన్ని అక్రమాలను న్యాయమూర్తి విస్మరించారని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. జయ సహా నలుగురికి శిక్ష పడాల్సిన అంశాలను కర్ణాటక హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అన్బగళన్ తన వాదనను వినిపించారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేసి నిందితులకు శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిసిన దశలో తేదీని ప్రకటించకుండా సుప్రీంకోర్టు గత ఏడాది జూన్ 7వ తేదీన వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు చెప్పనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. శశికళ శిబిరంలో కలకలం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శాసనసభా పక్ష నేతగా ఎన్నికై 24 గంటలు కాక మునుపే సుప్రీంకోర్టు తీర్పు గంట కొట్టడం కలకలం రేపింది. శశికళ నేడో రేపో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అలాగే ఈ నెల 9వ తేదీన సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తీర్పు వెలువడుతున్న పరిస్థితులు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అవరోధం అవుతుందేమోనని అన్నాడీఎంకేలో భయాందోళనలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ నెల 13వ తేదీన తీర్పు వెలువడాలి. అంటే శశికళ సీఎం అయిన నాలుగో రోజునే తీర్పు వస్తుంది. అనుకూలమైతే ఇబ్బందే లేదు, ప్రతికూలమైతే జైలు కెళ్లక తప్పదు. ఈ పరిస్థితుల్లో పదవీ ప్రమాణం వాయిదా వేసుకుంటారనే అనుమానాలు నెలకొన్నాయి. ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడం ఖాయమని అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎస్ కరుప్పయ్య వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో శశికళ జైలు కెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ సీఎంగా ఎవరిని నియమిస్తారని కూడా గార్డెన్ లో అప్పుడే చర్చ మొదలైంది. కొందరు పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్లు చెబుతున్నారు. శశికళ మనస్తత్వాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్‌సెల్వంకు అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా వేస్తున్నారు. వీరెవరూ కాదు శశికళ తన భర్త నటరాజన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
‘కని’కి పదవి
డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి పగ్గాల్ని ఎంపీ, గారాల పట్టి కనిమొళికి అప్పగించారు. యువజన విభాగం పగ్గాలను మళ్లీ స్టాలిన్‌కే కట్టబెట్టారు. ఈ మేరకు డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వివిధ విభాగాల నిర్వాహకుల్ని శుక్రవారం ప్రకటించారు. సాక్షి, చెన్నై:డీఎంకేలో ప్రక్షళన పర్వం సాగిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా జిల్లాల సంఖ్యను 65కు పెంచారు. పార్టీ పదవుల భర్తీ ప్రజాస్వామ్య బద్ధంగా సంస్థాగత ఎన్నికల ద్వారా విజయవంతం చేశారు. రాష్ర్ట పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి, ప్రధాన కార్యదర్శిగా అన్భళగన్, కోశాధికారిగా ఎంకే స్టాలిన్‌ను మళ్లీ ఎన్నుకున్నారు. ఈ సారి పదవుల భర్తీల్లో కనిమొళికి పార్టీ పరంగా అందలం ఎక్కిస్తారన్న ప్రచారం సాగింది. అయితే, పార్టీ పరంగా ఎలాంటి పదవులు ఆమెకు కట్టబెట్టలేదు. ఎట్టకేలకు ఆమెకు చిన్న ప్రమోషన్ ఇచ్చే రీతిలో సాంస్కృతిక విభాగం నుంచి మహిళా విభాగం పోస్టును అప్పగించారు. డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి పగ్గాలను కనిమొళికి అప్పగిస్తూ అన్భళగన్ ప్రకటించారు. యువజన విభా గం ఆవిర్భావ కాలం నాటి నుంచి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ కొనసాగుతూనే వచ్చారు. ఈ సారి మళ్లీ స్టాలిన్‌కు కోశాధికారి పగ్గాలే దక్కాయి. దీంతో యువజన పగ్గాల్లోను మార్పు జరగలేదు. ఆ పదవిని మళ్లీ స్టాలిన్‌కు కట్టబెడుతూ అధిష్టానం నిర్ణయించింది. కరుణతో అయ్యర్ భేటీ డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని కాంగ్రెస్ ఎంపీ మణిశంకరయ్యర్ కలుసుకున్నారు. ఉదయం గోపాలపురంలో ఈ భేటీ సాగడంతో ప్రధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నికల మద్దతు విషయంగా ఏమైనా చర్చ సాగుతున్నదేమోనన్న సంకేతాలతో మీడియా ఉరకలు తీసింది. అయితే, కేవలం మర్యాదేనని అయ్యర్ స్పష్టం చేయడంతో విస్తుపోక తప్పలేదు. ఈ భేటీ గురించి మణి శంకరయ్యర్ మాట్లాడుతూ, కరుణానిధిని కలుసుకుని చాలాకాలం అవుతోందని, ఇప్పుడు చెన్నై వచ్చిన దృష్ట్యా, మర్యాద పూర్వంగా ఆయన్ను కలుసుకున్నానన్నారు. తమ భేటీ పిచ్చా పాటికే పరిమితంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పడ్డ మాట వాస్తవమేనని, అందరూ కలసి కట్టుగా పునర్ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఓ ప్రశ్నకు అయ్యర్ సమాధానం ఇచ్చారు. జయంతి నటరాజన్ వ్యాఖ్యల గురించి అధిష్టానం స్పందించిందని, తనది అధిష్టానం బాటేనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకేతో కాంగ్రెస్ మళ్లీ దోస్తీ కట్టేనా..? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాజ్య సభలో డీఎంకే ఎంపీ కనిమొళి తాను, మరి కొందరు ఎంపీలందరూ ఒకే జట్టుగా తమిళులనాడు సమస్యలపై గళం విప్పుతున్నామని, తమకు రాజ్య సభలో కూటమి లేదని, అందరిదీ ప్రజా సమస్య పరిష్కారం మాత్రమే మార్గంగా పేర్కొన్నారు. డీఎంకే తో కాంగ్రెస్ కూటమి అన్నది అధిష్టానం చూసుకుంటుందన్నారు. -
డీఎంకేను ఎవ్వరూ చీల్చలేరు
డీఎంకేను చీల్చేందుకు ఇంత వరకు ఎవ్వరూ పుట్టలేదని ఆ పార్టీ అధినేత ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. పార్టీలో చీలికకు ఆస్కారం లేదని, బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు. సాక్షి, చెన్నై: డీఎంకేను చీల్చేందుకు ఇంతవరకు ఎవ్వరూ పుట్టలేదని ఆ పార్టీ అధినేత ఎం.కరుణానిధి అన్నారు. డీఎంకే నాయకుడు, ఎమ్మెల్యే అన్భళగన్ సోదరుడు కరుణానిధి, పునిద వల్లి దంపతుల కుమార్తె కే.మీనా అలియాస్ మోనీషా వివాహం తిరుత్తణికి చెందిన చంద్రశేఖర్, జయలక్ష్మి దంపతుల కుమారుడు యువరాజ్‌తో శుక్రవారం జరిగింది. డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నాఅరివాళయంలో అధినేత ఎం.కరుణానిధి సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈసందర్భంగా కరుణానిధి ప్రసంగిస్తూ డీఎంకే ఒక కుటుంబం అని, ఈ కుటుంబాన్ని పరిరక్షించేందుకు అన్భళగన్ లాంటి వాళ్లెందరో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వలే, ఈ అన్భళగన్ కూడా ఎల్లప్పుడూ పార్టీకి వెన్నెంటి ఉండి తన సేవల్ని అందిస్తారన్న నమ్మకం ఉందన్నారు. డీఎంకే మీద రకరకాల పుకార్లు, ప్రచారాలు సాగుతున్నాయని గుర్తుచేస్తూ, డీఎంకేను చీల్చడం లేదా నిర్వీర్యం చేయడానికి ఇంత వరకు ఎవ్వరూ పుట్టలేదని స్పష్టం చేశారు. పేరు మార్పు: తన పేరు కరుణానిధి అని, ఈ పేరులోని చివరి రెండు పదాలు ‘నిధి’ ఉత్తరాధి భాషగా పేర్కొన్నారు. తనపేరును మార్చేందుకు గతంలో ఓ మారు ప్రయత్నం జరిగిందని గుర్తుచేశారు. తన పేరును అరుల్ సెల్వర్గా మార్చేందుకు ప్రయత్నం జరిగిన సమయంలో తాను దివంగత నేత అన్నాను ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు తన పేరును కరుణానిధిగానే నేటికీ కొనసాగిస్తూ వస్తున్నానని వివరించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చొద్దంటూ ఆయన ఇచ్చిన సూచ న మేరకు తాను ముందుకు సాగుతూ వస్తున్నానని, ఈ కరుణానిధి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాడని, ఉంటానని, ఉండి తీరుతానని ప్రజల్ని ఉద్దేశించి వ్యా ఖ్యానించారు. ఈ వివాహ వేడుకలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే.స్టాలిన్, నాయకులు ఆర్కాట్ వీరా స్వామి, దయానిధి మార న్, వీపీ.దురైస్వామి, సద్గున పాండియన్, టీకేఎస్.ఇళంగోవన్, ఆర్.భారతీ, సుభావీర పాండియ న్, వీసీకే నేత తిరుమావళవన్ పాల్గొన్నారు. -
అళగిరి తో జర భద్రం!
సాక్షి, చెన్నై: పార్టీ నుంచి ఎంకే అళగిరిని ఇటీవల డీఎంకే అధిష్టానం తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చాక అళగిరి తన స్వరాన్ని పెంచుతూ వస్తున్నారు. మద్దతుదారులతో మంతనాల్లో బిజీబిజీగా ఉన్నారు. డీఎంకేను చీల్చే వ్యూహం తో దూసుకెళుతున్న అళగిరి రెండు రోజుల క్రితం మదురై వేదికగా జరిగిన మద్దతుదారుల మంతనాల అనంతరం తాను పార్టీ పెట్టబోనంటూ ప్రకటించారు. డీఎంకేను రక్షించుకోవడం, కరుణానిధికి అండగా నిలబడటం తన కర్తవ్యంగా ప్రకటించారు. కొందరి చెప్పు చేతుల్లోకి డీఎంకే వెళ్లిందని, వారి నుంచి పార్టీని రక్షించుకుందామని అళగిరి ఇచ్చిన పిలుపు డీఎంకే వర్గాల్ని ఆలోచనలో పడేసింది. పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి దుందుడుకు చర్యలు ఉండటం, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు రాక పోవడంతో అసంతృప్తితో ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే విధంగా అళగిరి వ్యాఖ్యలు ఉండడంతో డీఎంకే అధిష్టానం మేల్కొంది. అదే సమయంలో డీఎంకే నుంచి ఆహ్వానం వస్తే, వెళ్లేందుకు తాను సిద్ధమంటూ పరోక్ష సంకేతాన్ని అళగిరి ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో గందరగోళ పరిస్థితిని సృష్టించడం లక్ష్యంగా దక్షిణాది కింగ్ మేకర్ అళగిరి చక్రం తిప్పుతున్నట్టు అధిష్టానం గుర్తించింది. దీంతో కింగ్ మేకర్‌కు షాక్ ఇచ్చేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ద్వారా అధినేత కరుణానిధి హెచ్చరికలు జారీ చేశారు. జర భద్రం: బుధవారం డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆదేశాల మేరకు అన్నా అరివాళయం వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. అందులో అళగిరిని టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. పార్టీలో గందరగోళం సృష్టించడం లక్ష్యంగా, పార్టీ వర్గాల్ని పక్కదారి పట్టించే రీతి లో అళగిరి చర్యలు ఉన్నాయని వివరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతోనే అళగిరిని తాత్కాలికంగా బహిష్కరించామని గుర్తు చేశారు. అయితే, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతోపాటుగా, పార్టీలో గందరగోళం సృష్టించే లక్ష్యంగా ఆయన ముందుకెళుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీతో అళగిరికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంతనాలు, సమావేశాల పేరుతో పార్టీ నాయకులను, కార్యకర్తలను అళగిరి కలుస్తూ వస్తున్నట్టుగా అధిష్టానం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అళగిరి చర్యలు పార్టీకి నష్టం తెప్పించే అవకాశాలు ఉన్నాయని, దీన్ని గుర్తెరిగి ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యవహరించాలని సూచించారు. మరో మారు స్పష్టం చేస్తున్నామని అళగిరికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన పిలుపు మేరకు సమావేశాలు, సభలకు పార్టీ వర్గాలెవ్వరు వెళ్లడానికి వీలు లేదని హెచ్చరించారు. ఒక వేళ ఎవరైనా వెళ్లినట్టు తేలిన పక్షంలో క్రమ శిక్షణ చర్యలు తప్పదని, వారెంతటి వారైనా సరే ఉపేక్షించబోమన్నారు. అరుుతే అధిష్టానం హెచ్చరికతో అళగిరి స్పందిస్తూ, తాను డీఎంకే వ్యతిరేకిని కాను అని స్పష్టం చేశారు.