మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్నరేశ్ యాదవ్ను రాజీనామా చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ అడిగినట్లు తెలిసింది.
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్నరేశ్ యాదవ్ను రాజీనామా చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ కోరినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల విషయంలో అవినీతి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పదవి నుంచి మర్యాద పూర్వకంగా తప్పుకోవడమే మంచిదని సూచించింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రామ్ నరేశ్పై మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.