పెళ్లికి ముందురోజు.. | Duo held for consuming excessive alcohal in Train | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందురోజు..

Published Sat, Apr 9 2016 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

Duo held for consuming excessive alcohal in Train

పాట్నా: తెల్లవారితే పెళ్లి ఉందనగా చిన్ననాటి స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకుందామనుకున్న వరుడిని బీహార్ పోలీసులు జైలుకు పంపించారు. పంజాబ్లోని అమృత్ సర్కు చెందిన మన్దీప్(26) అతని చిన్ననాటి స్నేహితుడు బచితర్ సింగ్(28)తో కలిసి తన వివాహానికి పంజాబ్ మెయిల్లో థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కు బయలుదేరాడు.

బీహార్లో గత మంగళవారం నుంచి అమల్లో ఉన్న సంపూర్ణ మద్యపాన నిషేదం గురించి తెలియక పార్టీ చేసుకోవడంలో బీజీ అయిన వీరిద్దరిని ప్రయాణికుల ఫిర్యాదుతో దనాపూర్ వద్ద రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.23 లక్షల నగదు, ఒక ఐఎమ్ఎఫ్ఎల్‌ ఓపెన్ బాటిల్, మొబైల్ ఫోన్లు, సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను సీజ్ చేసినట్లు రైల్వే సూపరింటెండెంట్ పీఎన్ మిశ్రా తెలిపారు. భారతీయ రైల్వే యాక్ట్, నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు వివరించారు. నిందితులకు నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో ఎక్కువ మోతాదులో మద్యం స్వీకరించినట్లు తేలిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement