కోల్ కతా పోలీసు కమిషనర్ పై వేటు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎన్నికల సంఘం(ఈసీ) కొరడా ఝుళిపించింది. కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ పై వేటు వేసింది. ఆయనను కమిషనర్ పదవి నుంచి తొలగించింది. రాజీవ్ కుమార్ స్థానంలో అడిషనల్ డీజీ(సీఐడీ) సౌమెన్ మిత్రాను నియమించింది.
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ కుమార్ అనుకూలంగా వ్యహరిస్తున్నారని విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించడంతో ఆయనపై ఈసీ చర్య తీసుకుంది. కోట్లాది రూపాయల శారద చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తు సమయంలో ఆయన పేరు పతాక శీర్షికల్లో నిలిచింది.