న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఐటీ, ఈడీ లాంటి సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో వరుసగా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ మేరకు తాజాగా లేఖ రాసింది. దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్య తీసుకునే ముందైనా తమకు తెలియజేయాలని కోరింది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐటీ శాఖ పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ఎన్నికల వేళ అక్రమ నగదు చలామణి అవుతోందని అనుమానాలు వస్తే దాడులు చేసే ముందు సంబంధిత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలియజేయాలని ఈసీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment