విదేశీ జీవిత భాగస్వాములకు వీసా రూల్స్ మరింత కఠినం | Family Reunification of German Spouses in Visa Cases | Sakshi
Sakshi News home page

విదేశీ జీవిత భాగస్వాములకు వీసా రూల్స్ మరింత కఠినం

Published Sun, Jul 13 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

విదేశీ జీవిత భాగస్వాములకు  వీసా రూల్స్ మరింత కఠినం

విదేశీ జీవిత భాగస్వాములకు వీసా రూల్స్ మరింత కఠినం

లండన్: విదేశీ జీవిత భాగస్వాములకు బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. విదేశీ జీవిత భాగస్వామితో బ్రిటన్‌లో జీవితం గడపాలనుకునే బ్రిటన్ పౌరుల కనీస వార్షిక ఆదాయం 18,600పౌండ్లు (రూ. 10.10లక్షలు) ఉండాలన్న ప్రతిపాదనను బ్రిటన్ అపీల్ కోర్టు ఆమోదించింది. ఈ తీర్పు,..వీసాకు దరఖాస్తుచేసుకునే భారతీయ సంతతివారితో సహా వేలాదిమంది వీసా దరఖాస్తుదారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కనీస వార్షికాదాయంగా 18,600పౌండ్లు చాలా కష్టసాధ్యం, అసమంజసమని గత ఏడాది జూలైలో పేర్కొన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, బ్రిటన్ హోమ్‌శాఖ మంత్రి థెరెసా మే దాఖలు పిటిషన్‌పై అపీల్ కోర్టు తాజా తీర్పు చెప్పింది. నిర్దేశించిన వార్షికాదాయం సమంజసమేని పేర్కొంది. భారత్‌లో వివాహం చేసుకుని జీవిత భాగస్వాములను తమ వారసులుగా బ్రిటన్‌కు రప్పించుకోవాలనుకునే వారికి ఈ తీర్పు ఇబ్బంది కలిగిస్తుందని మీడియా శనివారం పేర్కొంది. గత జూలైలో వెలువరించిన తీర్పులో, కనీస ఆదాయాన్ని 13,400 పౌండ్లుగా హైకోర్టు న్యాయూర్తిజస్టిస్ బాల్కే సూచించారు. అయితే, ఆదాయం పరిమితిపై నిబంధనలు బ్రిటన్ జీవిత భాగస్వాముల హక్కులకు భంగకరంగా ఉన్నాయన్న జస్టిస్ బాల్కే అభిప్రాయం సరికాదని, నిబంధనలు సక్రమమేనని బ్రిటన్ అపీల్ కోర్టుకు చెందిన ముగ్గురు జడ్జీలు తమ తీర్పులో అభిప్రాయపడినట్టు గార్డియన్ పత్రిక తెలిపింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement