
దర్జాగా వెళ్లిన తండ్రికొడుకులు ఏం చేశారంటే..
న్యూఢిల్లీ: కార్ల అమ్మకం సంగతి దేవుడెరుగు.. టెస్ట్ డ్రైవింగ్లు అమ్మకందార్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. టెస్ట్ డ్రైవింగ్ కోసం అంటూ కార్లు తీసుకెళ్లిన వారు అటే ఉడాయిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో డ్రైవింగ్ టెస్ట్ చేస్తామంటూ ఇద్దరు తండ్రికొడుకులు మెర్సిడీస్ బెంజ్ కారును ఎత్తుకెళ్లారు. చివరకు నానా తంటాలు పడి పోలీసులు అరెస్టు చేశారు.
సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ కార్ల షోరూంకు అనిల్ ఆనంద్(54), సాహిల్ ఆనంద్(23) అనే ఇద్దరు తండ్రి కొడుకులు కారు కొనడానికంటూ వచ్చారు. డ్రైవింగ్ పరీక్ష చేస్తామని మెర్సిడీస్ కారుతో వెళ్లి అటునుంచి అటే ఉడాయించారు. తిరిగి వారిని గుర్గావ్లో పోలీసులు అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేశారు.