చెన్నై: కొన్ని సినిమాలు యువకుల ఆలోచనలను, మెదళ్లను పాడు చేస్తున్నాయని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం చేసింది. సినీ నిర్మాతలు ఒక సామాజిక బాధ్యతగా సినిమాలు రూపొందించాలని మంచి విషయాలు, విలువలు తమ చిత్రాల ద్వారా నేటి యువతకు అందించాల్సిందిపోయి పెడదోవపట్టిస్తున్నారని పేర్కొంది. కొన్ని సినిమాల్లో అసభ్యకరంగా పాటలు పాడటమే కాకుండా ఓ మహిళతో చెడుగా ప్రవర్తించాడనే కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ విద్యానాదన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
అతడి బెయిల్ పిటిషన్ పై స్పందిస్తూ 'మాటల్లో, పాటల్లో అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ కొన్ని సినిమాలు యువకుల మనసులను, ఆలోచనను పాడు చేస్తున్నాయి. చిత్ర నిర్మాతల విషయంలో ఈ కోర్టు చాలా అసంతృప్తిగా ఉంది. చిత్ర నిర్మాతలు, తీసేవారు మంచి నైతిక విషయాలను, గొప్ప విషయాలను సినిమాల ద్వారా చెప్పడానికి బదులు యువ మెదళ్లను అవినీతిమయం చేస్తున్నారు. వ్యర్థపదాలు ఉపయోగిస్తూ చెడు సంఘర్షణకు గురి చేస్తున్నారు. హింసతో నిండిన సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. వీటి వల్ల సమాజంలోని సంస్కృతి నైతిక విలువులు నానాటికి తగ్గిపోతున్నాయి' అని కోర్టు వ్యాఖ్యానించింది.
'సినిమా అంటే బాధ్యత.. కల్చర్ పాడు చేయొద్దు'
Published Sun, Sep 4 2016 3:47 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement