
న్యూఢిల్లీ: నోయిడాలోని శ్రీనివాస్‌పురిలో అర్థరాత్రి ఓ ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండతస్తుల భవనంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులకు మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 26 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment