ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో స్వైన్ ఫ్లూ మహామ్మారి ఐదుగుర్ని బలి తీసుకుంది. వీరిలో ఒకరు ముంబైలోని బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మిగతవారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారున్నారు. కాగా, నగర శివారు ప్రాంతాల్లో మంగళవారం ఒకే రోజు స్వైన్ ఫ్లూ సోకిన 66 మంది రోగులను గుర్తించారు. ఇలా ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రోగులను గుర్తించడం గత రెండు నెలల కాలంలో ఇదే ప్రథమం.
గుర్తించిన మొత్తం 66 రోగుల్లో 35 మంది మహిళలు, 13 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్న 21 మందిని ఆస్పత్రిలో చేర్చుకొని, మిగతావారికి ప్రథమ చికిత్స చేసి పంపించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో మొత్తం 341 మంది స్వైన్ ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 66 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,18,342 మంది అనుమానితులను పరీక్షించగా వీరిలో పది వేలకు పైగా మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు.
స్వైన్ ఫ్లూతో ఐదుగురి మృతి
Published Thu, Feb 26 2015 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement